పహల్గాం దాడిని ఖండిస్తూ మల్కాపూర్ యూత్,అఖిలపక్షం ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ
అమాయక పర్యాటకుల మృతికి కోవొత్తులతో నివాళి
చిల్పూర్, తెలంగాణ ముచ్చట్లు:
జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో అమాయక పర్యాటకులపై ముష్కరులు నిర్వహించిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ జనగాం జిల్లా చిల్పూర్ మండలం మల్కాపూర్ గ్రామ యూత్ మరియు అఖిలపక్షం ఆధ్వర్యంలో కోవొత్తులతో మౌన ర్యాలీ నిర్వహించారు. గ్రామంలో భారీగా యువతీ యువకులు, గ్రామస్తులు ర్యాలీలో పాల్గొని అమాయకుల మృతికి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కేశిరెడ్డి లక్ష్మారెడ్డి, తోకల సంపత్ రెడ్డి మాట్లాడుతూ,
“అమాయక పర్యాటకులపై ముష్కరులు చేయించిన అఘాయిత్యం మానవత్వానికి చెరసి. ఇటువంటి దాడులు దేశ ఐక్యతను, సామరస్యాన్ని భంగం చేయలేవు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాం. దేశ భద్రత కోసం ప్రతి పౌరుడూ మద్దతుగా నిలవాలి,” అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కేశిరెడ్డి లక్ష్మారెడ్డి, తోకల సంపత్ రెడ్డి, ఉరడి సతీష్, దొరమ్ శ్రీనివాస్, చొప్పరి అజయ్, కుమార్, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. యూత్ సభ్యులు కూడా పెద్దఎత్తున పాల్గొని సామూహికంగా మౌనం పాటించారు. ర్యాలీ చివర్లో దేశ భద్రతా బలగాలకు మద్దతుగా నినాదాలు చేయడం జరిగింది.
Comments