భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారమే మేడేకు నిజమైన అర్థం

తాటికాయల భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం అధ్యక్షులు  బొల్లెపాక యాదగిరి డిమాండ్

భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారమే మేడేకు నిజమైన అర్థం

ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు: 

ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని మనం ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకుంటున్నాం. కానీ ఈ పండుగకు నిజమైన అర్థం వచ్చేలా కార్మికుల జీవితాల్లో మార్పు రావాలి. మా సమస్యలు చెవికి వినిపించేలా అధికార వ్యవస్థ స్పందించాలి” అని తాటికాయల గ్రామ భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం అధ్యక్షులు  బొల్లెపాక యాదగిరి అన్నారు.

బుధవారం బొల్లెపాక యాదగిరి  మీడియాతో మాట్లాడుతూ – “భవన నిర్మాణ కార్మికులకు ఎన్నో హక్కులు చట్టంలో ఉన్నప్పటికీ అవి కేవలం కాగితాల పరిమితంగా మిగిలిపోతున్నాయి. కార్మిక సంక్షేమ బోర్డులో కార్మికులకే ఛైర్మన్ పదవి ఇవ్వాలని, కార్మికులకు మంజూరైన పథకాలను ప్రైవేట్ కంపెనీలకు అప్పగించకుండా ప్రభుత్వం స్వయంగా నిర్వహించాలనే మా డిమాండ్లను మళ్లీ, మళ్లీ చెబుతున్నా స్పందన లేకపోవడం బాధాకరం” అని ఆవేదన వ్యక్తం చేశారు.

“మా కార్డులు తాత్కాలికంగా కాకుండా శాశ్వతంగా పనిచేసేలా చూడాలి. కార్మిక శాఖకు ప్రత్యేకంగా ఓ మంత్రిని నియమించాలి. వయస్సు 55 పూర్తైన ప్రతి కార్మికుడికి పెన్షన్ కల్పించాలి. పని సమయంలో ప్రమాదవశాత్తు మరణించిన కార్మిక కుటుంబాలకు కనీసం పదిహేను లక్షల రూపాయల భీమా సాయం అందించాలి. అలాగే ఉపాధి హామీ కూలీలను శాశ్వత ఉద్యోగులుగా మారుస్తూ బోర్డు పరిధిలోనే కొనసాగించాలి” అని స్పష్టం చేశారు.

ఇక కాంగ్రెస్ పార్టీపై కూడా బొల్లెపాక యాదగిరి అసంతృప్తి వ్యక్తం చేశారు. “ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చిన తర్వాత భవన నిర్మాణ కార్మికులకు స్కూటీలు (ద్విచక్ర వాహనాలు) అందిస్తానని వాగ్దానం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పటి వరకూ ఆ మాటను నిలబెట్టుకోలేదు. కార్మికుల అవసరాలు ఓటు వేసేంతవరకే అని భావిస్తే అది పెద్ద తప్పు. కార్మికుల విశ్వాసాన్ని నిలబెట్టాలంటే వెంటనే ఆ వాహనాలను అందించాలి” అని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా కార్మికుల త్యాగాలను గుర్తు చేస్తూ – “వేలాది మంది కార్మికులు 8 గంటల పని హక్కు కోసం తమ జీవితాలను అర్పించారు. వారికి నిజమైన గౌరవం ఇచ్చే దిశగా ప్రభుత్వం నడవాలి. లేవని ఈ రోజు మాటలకే పరిమితం కాకుండా చర్యలతో మద్దతుగా నిలవాలి” అని వ్యాఖ్యానించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారమే మేడేకు నిజమైన అర్థం భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారమే మేడేకు నిజమైన అర్థం
ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:  ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని మనం ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకుంటున్నాం. కానీ ఈ పండుగకు నిజమైన అర్థం వచ్చేలా కార్మికుల జీవితాల్లో మార్పు రావాలి....
భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారమే మేడేకు సార్థకత
క్రికెట్ క్రీడా పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే
మే డే వాల్ పోస్టర్ విడుదల
ఇందిరమ్మ ఇళ్లతో పేదల కలలు సాకారం
దేశానికి ఆదర్శంగా భూ భారతి చట్టం... 
శ్రీ మహాత్మా బసవేశ్వర జయంతి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి......