డీజీపీ రేసులో 8 మంది 

యూపీఎస్సీకి పేర్ల జాబితా పంపిన రాష్ట్ర ప్రభుత్వం

డీజీపీ రేసులో 8 మంది 

హైదరాబాద్,తెలంగాణ ముచట్లు:
రాష్ట్ర డీజీపీ పదవికి కొత్త అధికారి ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. ఈ క్రమంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు (యూపీఎస్సీ) రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది మంది అగ్రశ్రేణి ఐపీఎస్ అధికారుల పేర్లను పంపింది. వీరిలో వివిధ బ్యాచ్‌లకు చెందిన అధికారులు ఉన్నారు.
 
పంపిన జాబితాలో ఉన్నవారు:
• రవి గుప్తా (1990 బ్యాచ్)
• సీవీ ఆనంద్ (1991 బ్యాచ్)
• డా. జితేందర్ (1992 బ్యాచ్)
• ఆప్టే వినాయక్ ప్రభాకర్ (1994 బ్యాచ్)
• కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి (1994 బ్యాచ్)
• బి. శివధర్ రెడ్డి (1994 బ్యాచ్)
• డా. సౌమ్య మిశ్రా (1994 బ్యాచ్)
• శిఖా గోయల్ (1994 బ్యాచ్)
 
అర్హతలు, సీనియారిటీ, సేవా కాలం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని, ఈ ఎనిమిది మందిలో ముగ్గురు అధికారుల పేర్లను ఎంపిక చేసి యూపీఎస్సీ తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి సూచించనుంది.
 
ప్రస్తుతం డీజీపీగా ఉన్న డా. జితేందర్ ఈ ఏడాది సెప్టెంబర్ 6న పదవీ విరమణ చేయనున్నారు. అలాగే కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఆగస్టు 5న, రవి గుప్తా డిసెంబర్ 19న రిటైర్ కానున్నారు.
 
ఇతరుల సేవా కాలాలు:
• సీవీ ఆనంద్ – 2028 జూన్ వరకు
• ఆప్టే వినాయక్ ప్రభాకర్ – 2029 అక్టోబర్
• బి. శివధర్ రెడ్డి – 2026 ఏప్రిల్ 28
• డా. సౌమ్య మిశ్రా – 2027 డిసెంబర్ 30
• శిఖా గోయల్ – 2029 మార్చి
 
ఈ నేపథ్యంలో డీజీపీ పదవికి ఎవరు ఎంపికవుతారు అన్నది రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది.
Tags:

Post Your Comments

Comments

Latest News

నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు
పెద్దమందడి,నవంబర్02(తెలంగాణ ముచ్చట్లు): రైతులు లాభసాటి వ్యవసాయం చేయాలంటే నాణ్యమైన వరి విత్తనాలను వాడటం అత్యవసరమని వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు అధికారులు సూచించారు. పెద్దమందడి మండల పరిధిలోని పామిరెడ్డి...
తుఫాన్ బాధిత రైతులను  ప్రభుత్వం ఆదుకోవాలి 
విద్యుత్ వినియోగదారుల దినోత్సవం
మృతుని కుటుంబానికి మేఘన్న చేయూత
హరీష్‌రావు నివాసంలో రేగళ్ల సతీష్‌రెడ్డి, యువజన నేతల పరామర్శ
బీసీలకు 42% రిజర్వేషన్లపై కఠిన పోరాటం  ఈటల రాజేందర్
నారాయణ స్కూల్ లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్.!