కేంద్రానికి.. కనువిప్పు కావాలి..

ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఖమ్మం జిల్లా.. 

కేంద్రానికి.. కనువిప్పు కావాలి..

ఈనెల 30 వ తేదీ రాత్రి  కులమతాలకతీతంగా స్వచ్ఛందంగా గృహ, వాణిజ్య సముదాయాలలో విద్యుత్ లైట్ల బంద్ నిరసన కార్యక్రమం సక్సెస్ చేద్దాం..

–ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఖమ్మం జిల్లా యూనిట్ వెల్లడి....

ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:

విద్వేషoతో, అహంకార పూరిత ధోరణితో  వ్యవహరిస్తున్న  కేంద్ర ప్రభుత్వo తీరుకు నిరసనగా 
ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ఖమ్మం జిల్లా యూనిట్ ఆధ్వర్యంలో  కుల మతాలకు అతీతంగా నిరసనల పర్వాన్ని ఉదృతం చేస్తున్నామని, అందులో భాగంగానే  జిల్లా ప్రజలు  తమ తమ నివాసాలు, వాణిజ్య సముదాయాలలో ఈనెల  30 వ తేదీ రాత్రి 9 గంటల నుంచి 9 గంటల 10 నిమిషాల వరకు (మొత్తం 10 నిమిషాలు ) విద్యుత్ లైట్లను  స్వచ్చందంగా నిలిపి వేసుకుని నిరసనను తెలుపుతూ... కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగడుతూ.. ముస్లిం మైనార్టీలు వినూత్న  నిరసనను తెలపాలని,  తక్షణమే వక్ఫ్ సవరణ  చట్టాన్ని రద్దు చేసేoతవరకు తమ నిరసనలను విరమించే ప్రసక్తే లేదని యూనిట్ హెచ్చరించింది..మంగళవారం ఖమ్మం నగరం లోని టీ ఎన్ జి ఓ ఫంక్షన్ హాలులో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ఖమ్మం జిల్లా యూనిట్ ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో అఖిల పక్ష రాజకీయ, ప్రజాసంఘాల నేతలు 
ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ఖమ్మం జిల్లా జేఏసీ సభ్యులు మౌలానా మొహమ్మద్ సయీద్ అహ్మద్ ఖాస్మి, ఇల్యాస్, అజహరుద్దీన్, షేక్ అబ్దుల్ రషీద్, కాంగ్రేస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్, సిపిఎం ఖమ్మం కార్యదర్శి వై విక్రమ్ , బి ఆర్ ఎస్ పార్టీ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్, మచ్చా వెంకటేశ్వర్లు, సీపీఐ ఎంఎల్ (మాస్ లైన్)జిల్లా కార్యదర్శి గోగినెపల్లి వెంకటేశ్వర్లు, ఎంఎల్ పార్టీ కార్యదర్శి మధు, సేవాలాల్ సేన అధ్యక్షుడు కిషన్ నాయక్, మాల మహానాడు అధ్యక్షులు కొట్టే సుధాకర్, ముఫ్తీ జలాలుద్దీన్ ఖాస్మీ, ముహమ్మద్ సాదిక్, మొహమ్మద్ అసద్, జైనుల్ అబిదీన్,లు మాట్లాడారు.
వక్ఫ్ సవరణ-2025 చట్టం రద్దు కోసం అఖిలపక్ష రాజకీయ పార్టీలు ప్రజాసంఘాలు ఏకమై ఐక్య న్యాయ పోరాటాలతో తమ హక్కులు సాదించుకుంటామని కేంద్రాన్ని వారు హెచ్చరించారు.
వక్ఫ్ అంటే ఇస్లామీయ పరిభాషలో ధార్మిక అవసరాల కోసం, లేదా ప్రజా సంక్షేమం కోసం అల్లాహ్ మార్గంలో దానం చేసిన ఆస్తి. అని కమిటీ తెలిపింది. ఒక వ్యక్తి తన వ్యక్తిగత ఆస్తిని దైవ మార్గంలో శాశ్వతంగా దానం చేయడం. ఆ ఆస్తిని అమ్మడం గాని స్వప్రయోజనాలకు వాడుకోవడానికి గాని  ఏ మాత్రం ఆస్కారం ఉండదని అన్నారు... వక్ఫ్ భూములను సాధారణంగా మసీదుల నిర్మాణం, స్మశాన వాటికలు, మదర్సాలు, ఆసుపత్రులు, విద్యాసంస్థల నిర్మాణం తదితర ప్రజాసంక్షేమ కార్యక్రమాలకు మాత్రమే వాడుకునే అవకాశం ఉందని కూడా గుర్తు చేశారు.. 
వక్ఫ్ పరిరక్షణ ధార్మిక విధి. రాజ్యాంగ విలువలను పరిరక్షించడం ప్రతి పౌరుని కర్తవ్యం అని, ఈ కొత్త చట్టం రాజ్యాంగ అధికరణ 14,15,16,25,26, 300 ఏ కు విరుద్దం అని,ఇది పూర్తి అప్రజాస్వామికమని కమిటీ పేర్కొంది. వక్ఫ్ తలుచుకుంటే ఎవరి ఆస్తినైన అక్రమించు కోగలదనే తప్పుడు ప్రచారం, సమాచారాన్ని వ్యాప్తి చేసి ప్రజల్లో అపోహలు సృష్టించే కుట్రకు ప్రయత్నం జరుగుతుందని తాము భావిసున్నామని అన్నారు.  
ఈ కొత్త చట్టంను రద్దు చేసి వందల సంవత్సరాల మసీదులకు, మదర్సాలకు, ఆశుర్ ఖాన, స్మశాన వాటికలకు, ఈద్గా, దర్గాలకు పత్రాలు సమర్పించాలని చెబుతుందని,  ఇది సాధ్యపడే విషయమేనా? అని,  ఇది రాజ్యాంగం కల్పించిన 26 వ నిబంధనకు విరుద్దం కాదా ? అని వారు ప్రశ్నించారు.. ముస్లిం మైనారిటీలను విభజించే ఆలోచన దిశగా వ్యవరిహిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి చెక్ పెట్టేందుకు నిరసన కార్యక్రమాలలో భాగంగా విద్యుత్ లైట్లను ఆపి వేసే నిరసన కార్యక్రమాన్ని తలపెట్టినట్లు వారు వెల్లడించారు..వక్ఫ్ సవరణ చట్టoలో లోపాలు.. ఉన్నాయని  గత దశాబ్దాలుగా ఉన్న వక్ఫ్ ఆస్తులకు సంబంధించి వాటి ఆధారాలను చూపించి నమోదు చేయుటకు సవరణ చేయబడినదని,  దీనిని వ్యతిరేకిస్తున్నామన్నారు.. IMG-20250429-WA0033ప్రస్తుతం దాత అల్లాహ్ పేరిట దానము చేయదలచితే తను ఐదు సంవత్సరాల పాటు ముస్లింలుగా ధ్రువీకరణ పత్రము అందించిన తర్వాత దానము చేయుటకు అర్హుడు అనే నిబంధనను పూర్తిగా తాము  వ్యతిరేకిస్తున్నామని. పేర్కొన్నారు...వక్ఫ్ ఆస్తుల నుండి సుమారు ఏడు శాతం ఆదాయం రాష్ట్ర ప్రభుత్వాలకు రెవెన్యూగా వస్తుందని, కేంద్ర ప్రభుత్వం తమ ఆధీనములో తీసుకునేందుకు ఇది కుట్ర కోణం  అని వారన్నారు..
కేంద్ర ప్రభుత్వం...మన దేశంలో అతిపెద్ద మైనారిటీలపై వక్ఫ్ సవరణ చట్టం ద్వారా చేసిన కుట్ర.. ఇది అని, భవిష్యత్తులో క్రైస్తవ, జైను, సిక్కు తదితర మైనారిటీలపై కూడా కుట్ర కోణాలు ప్రదర్శించే ప్రమాదం ఉందని  వారు హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించే కుట్రచర్యలను తిప్పికొట్టేందుకు అందరూ సమిష్టిగా పోరాడాల్సిన అవసరం ఉందని, పిలుపునిచ్చారు..
సవరణ చట్టంలో అనేక లుసుగులు ఉన్నాయని, ఇది సాంకేతికంగా, తాత్కాలికంగా  రూపొందించబడలేదని, అందుకే  వక్ఫ్ ఆస్తులు కొల్లగొట్టడానికి చేసిన కేంద్ర ప్రభుత్వ కుట్ర ప్రయత్నాన్ని తిప్పి కొట్టే విషయంలో రెట్టింపు స్ఫూర్తితో మనమతా ముందుకు సాగాల్సిన అవసరం ఉన్నదని  కోరారు.  
జిల్లా ప్రజలు కుల,మత, రాజకీయాలకు అతీతంగా కలిసి వచ్చి  ఐక్యఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉందని వారు అన్నారు. నిరసన కార్యక్రమ విజయవంతం కోసం ఏకమౌవ్వాలని పిలుపునిచ్చారు.  ఈవిలేఖరుల సమావేశంలో వక్తలు, రాజకీయ నాయకులు, సామాజికవేత్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారమే మేడేకు నిజమైన అర్థం భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారమే మేడేకు నిజమైన అర్థం
ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:  ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని మనం ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకుంటున్నాం. కానీ ఈ పండుగకు నిజమైన అర్థం వచ్చేలా కార్మికుల జీవితాల్లో మార్పు రావాలి....
భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారమే మేడేకు సార్థకత
క్రికెట్ క్రీడా పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే
మే డే వాల్ పోస్టర్ విడుదల
ఇందిరమ్మ ఇళ్లతో పేదల కలలు సాకారం
దేశానికి ఆదర్శంగా భూ భారతి చట్టం... 
శ్రీ మహాత్మా బసవేశ్వర జయంతి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి......