భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారమే మేడేకు సార్థకత

రాష్ట్ర ప్రచార కార్యదర్శి నల్ల స్వామి డిమాండ్

భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారమే మేడేకు సార్థకత

హన్మకొండ,తెలంగాణ ముచ్చట్లు: 
 
ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శి నల్ల స్వామి రెండు తెలుగు రాష్ట్రాల కార్మిక సోదరులందరికీ మేడే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ – 8 గంటల పని దినం సాధించడానికి కార్మికులు చేసిన త్యాగాల్ని గుర్తు చేశారు. ఎంతో మంది ప్రాణ త్యాగంతో సంపాదించుకున్న హక్కుల పట్ల ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
 
కార్మికుల ప్రధాన డిమాండ్లు:
1.భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డుకు కార్మికులలోనుంచి ఛైర్మన్‌ను నియమించాలి.
2.సంక్షేమ పథకాలను ప్రైవేటు ఇన్స్యూరెన్స్ కంపెనీలకు అప్పజెప్పే వ్యవహారాన్ని నిలిపివేసి టెండర్లు రద్దు చేయాలి.
3.కార్మికుల కార్డులు శాశ్వతంగా పనిచేసే విధంగా చేయాలి.
4.ప్రత్యేకంగా కార్మిక శాఖకు మంత్రిని నియమించాలి.
5.ప్రతి కార్మికుడికి 55 సంవత్సరాలు నిండగానే పెన్షన్ సౌకర్యం కల్పించాలి.
6.ప్రమాదవశాత్తు మరణించిన కార్మిక కుటుంబాలకు రూ.10 లక్షల భీమా సాయం ఇవ్వాలి.
7.ఉపాధి హామీ కార్మికులను శాశ్వత ఉద్యోగులుగా నియమించి బోర్డు నుండి తొలగించకుండా పరిరక్షించాలి.
 
1996లో వచ్చిన చట్టాన్ని పూర్తిగా అమలు చేయకపోవడం వల్ల కార్మిక లోకానికి తీరని అన్యాయం జరుగుతోందని నల్ల స్వామి పేర్కొన్నారు. మేడే పండుగ రోజున కార్మికుల సమస్యలకు న్యాయం జరగాలని కోరుకుంటున్నామని తెలిపారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారమే మేడేకు నిజమైన అర్థం భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారమే మేడేకు నిజమైన అర్థం
ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:  ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని మనం ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకుంటున్నాం. కానీ ఈ పండుగకు నిజమైన అర్థం వచ్చేలా కార్మికుల జీవితాల్లో మార్పు రావాలి....
భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారమే మేడేకు సార్థకత
క్రికెట్ క్రీడా పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే
మే డే వాల్ పోస్టర్ విడుదల
ఇందిరమ్మ ఇళ్లతో పేదల కలలు సాకారం
దేశానికి ఆదర్శంగా భూ భారతి చట్టం... 
శ్రీ మహాత్మా బసవేశ్వర జయంతి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి......