అంచనాలకు మించి బీఆర్ఎస్ రజతోత్సవ సభ విజయవంతం

మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

అంచనాలకు మించి బీఆర్ఎస్ రజతోత్సవ సభ విజయవంతం

వనపర్తి, తెలంగాణ ముచ్చట్లు:

వరంగల్ లో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ అంచనాలకి మించి విజయవంతమైందని మాజీమంత్రి అన్నారు. కాంగ్రెస్ 17 నెలల పాలనా వైఫల్యాలు, అబద్దపు హామీలు, దౌర్జన్యాలకు చెంపపెట్టు. ఈ సభ 17 నెలలలో తెలంగాణను అన్ని రంగాల్లో ఆగం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేసీఆర్  ప్రశ్నించారు. అంశాలవారీగా వాటికి సమాధానం చెప్పలేని మంత్రులు కారుకూతలు కూస్తున్నారు .. దానిని వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం.
రజతోత్సవ సభతో యావత్ తెలంగాణ కేసీఆర్ వెన్నంటి ఉందని ప్రజలు రుజువు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారం గుప్పిట్లో పెట్టుకుని సభ సజావుగా సాగకుండా, ప్రజలు సభకు రాకుండా ఎన్ని అడ్డంకులు సృష్టించినా జన సునామీ ముందు వారి ఆటలు సాగలేదు .మండుటెండలను లెక్కచేయకుండా లక్షలాదిగా తరలివచ్చిన తెలంగాణ ప్రజలకు, ఉమ్మడి పాలమూరు ప్రజలకు, వనపర్తి నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు .వరంగల్ ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేసిన ప్రజలకు, కార్యకర్తలు, నేతలు, అభిమానులు అందరికీ ఒక ప్రకటనలో ధన్యవాదాలు తెలియజేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

రెండో విడత ఎన్నికలలో గెలుపొందిన అభ్యర్థులు రెండో విడత ఎన్నికలలో గెలుపొందిన అభ్యర్థులు
హాసన్ పర్తి, డిసెంబర్ 14(తెలంగాణ ముచ్చట్లు) రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా హసన్ పర్తి మండలంలోని గ్రామపంచాయితీలలో కొత్తపల్లి సర్పంచిగా దండ్రి సాంబయ్య,అర్వపళ్లి సర్పంచ్ గా...
ప్రశాంతంగా రెండవ విడత పంచాయతీ ఎన్నికలు... 
అంతర్జాతీయ ప్రమాణాలతో ఖమ్మం నగరాభివృద్ధికి చర్యలు.... 
ప్రశాంతంగా ముగిసిన రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌
గ్రామ అభివృద్ధికి కృషి చేస్తా.
చిల్కానగర్ డివిజన్‌లో విస్తృతంగా పర్యటించిన కార్పొరేటర్ బన్నాల
జమ్మిగడ్డను ప్రత్యేక డివిజన్‌గా ప్రకటించాలి