మే డే వాల్ పోస్టర్ విడుదల

ఘట్టమ్మ జిపి మండల అధ్యక్షురాలు పెద్దమందడి

మే డే వాల్ పోస్టర్ విడుదల

వనపర్తి, తెలంగాణ ముచ్చట్లు:

వనపర్తి జిల్లా, పెద్దమందడి మండల కేంద్రంలో మే 1 న, 139 వ అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మే డే ను, ఒక పండుగలా కాకుండా దీక్ష దినంగా జరుపుకోవాలని పెద్దమందడి జీపీ కార్మికుల అధ్యక్షురాలు ఘట్టమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మే డే వాల్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... మేడే పోరాట స్ఫూర్తితో పెట్టుబడిదారుల కార్పొరేట్ మతోన్మాద దోపిడీదారులు అణిచివేతలు, వివేక్షకులకు వ్యతిరేకంగా పోరాడుతూ, వర్గ ఐక్యత సాధించి వర్గ పోరాటాలను ఉదృతం చేయాలని, కార్మిక వర్గ ప్రతిఘటన వల్ల నే ఎనిమిది గంటల పని దినం చట్టం చేయబడిందన్నారు. 139 సంవత్సరాల క్రితం 10 గంటల నుండి 16 గంటలు వరకు పని దినముంటే, దాన్ని తగ్గించుకునేందుకు జరిగిన పోరాటంలో ప్రాణాలు సైతం త్యాగం చేశారు ఆనాటి మన పోరాట యోధులు అని అన్నారు. మేడే 1 నా, జరిగే జెండా కార్యక్రమంలో, పెద్దమందడి మండల పరిధిలోని అన్ని గ్రామాల కార్మికులు, జెండావిష్కరణలో పాలుపంచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో, పెద్దమందడి మండల జిపి కార్మికుల విభాగం అధ్యక్షురాలు ఘట్టమ్మ, వెంకటమ్మ, సుందరయ్య, ఆంజనేయులు, కురుమన్న, బి.నిరంజన్, వాసన్న, తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారమే మేడేకు నిజమైన అర్థం భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారమే మేడేకు నిజమైన అర్థం
ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:  ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని మనం ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకుంటున్నాం. కానీ ఈ పండుగకు నిజమైన అర్థం వచ్చేలా కార్మికుల జీవితాల్లో మార్పు రావాలి....
భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారమే మేడేకు సార్థకత
క్రికెట్ క్రీడా పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే
మే డే వాల్ పోస్టర్ విడుదల
ఇందిరమ్మ ఇళ్లతో పేదల కలలు సాకారం
దేశానికి ఆదర్శంగా భూ భారతి చట్టం... 
శ్రీ మహాత్మా బసవేశ్వర జయంతి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి......