సర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించండి 

చిన్నారెడ్డి కి వినతి పత్రం అందించిన సర్పంచుల సంఘం జేఏసీ 

సర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించండి 

వనపర్తి, తెలంగాణ ముచ్చట్లు:

సర్పంచుల సంఘం రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ప్రతినిధులు  రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్  డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి ని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.మంగళవారం మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్ లో జరిగిన ఈ భేటీలో సర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. రాష్ట్రంలో సర్పంచులు బిల్లులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అప్పులు చేసే అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి  చేశారని వాటికి సంబంధించిన బిల్లులు మంజూరు కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారనీ, సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఈ సందర్భంగా వారు చిన్నారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. సర్పంచుల సమస్యలపై సానుకూలంగా స్పందించిన  చిన్నారెడ్డి  వారి వినతి పత్రంపై ఆర్ధిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి ఎండార్స్మెంట్ చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .