క్రాంతి కుమార్, దిలీప్‌లకు నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే రాజయ్య

క్రాంతి కుమార్, దిలీప్‌లకు నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే రాజయ్య

స్టేషన్ ఘనపూర్, తెలంగాణ ముచ్చట్లు:

స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రానికి చెందిన చింత క్రాంతి కుమార్ ఆదివారం జరిగిన రోడ్డుప్రమాదంలో మరణించగా, సోమవారం స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య వారి ఇంటికి వెళ్లి క్రాంతి కుమార్  పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదార్చారు.

అదే విధంగా, ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామానికి చెందిన ఎర్ర దిలీప్ ప్రమాదవశాత్తు మరణించడంతో, తాటికొండ రాజయ్య వారి నివాసానికి వెళ్లి దిలీప్ పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

ఈ కార్యక్రమాల్లో ఎర్ర అశోక్, ఎర్ర వెంకటస్వామి, పట్ల మీస రాజయ్య, బొల్లెపాక సంపత్, పట్ల మహేష్, బొల్లెపాక నగేష్IMG-20250331-WA0039బొల్లెపాక రమేష్, పట్ల రమేష్, గుర్రపు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .