మృతుల కుటుంబాలను పరామర్శించిన సింగపురం ఇందిర

మృతుల కుటుంబాలను పరామర్శించిన సింగపురం ఇందిర

IMG-20250326-WA0044

.రఘునాథపల్లి,తెలంగాణ ముచ్చట్లు:
పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన సీనియర్ నేతల కుటుంబాలను కాంగ్రెస్ ఎప్పుడూ ఆదుకుంటుందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, స్టేషన్‌గంపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి సింగపురం ఇందిర అన్నారు.

జనగామ జిల్లా ఉపాధ్యక్షుడు లింగాల జగదీశ్ రెడ్డి తండ్రి లింగాల నరసింహారెడ్డి, కాంగ్రెస్ నేత జోగారెడ్డి ఇటీవల మృతి చెందడంతో బుధవారం ఇబ్రహింపురానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. నరసింహారెడ్డి, జోగారెడ్డి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పిస్తూ, కాంగ్రెస్ పార్టీకి అందించిన వారి సేవలను గుర్తు చేసుకున్నారు. వారి కుటుంబాలకు ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

అంతేగాక, రఘునాథపల్లి మండలానికి చెందిన కంచనపెల్లి పిఎసిఎస్ చైర్మన్ చీమలపాటి రవీందర్, నారాయణపురం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మాజిగొల్లూరి ఐలయ్య మరణించడంతో, వారి నివాసాలకు వెళ్లి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, ఎలాంటి అవసరమైనా కాంగ్రెస్ పార్టీ వెన్నుతట్టిపోతుందని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ, మండల, గ్రామస్థాయి కాంగ్రెస్ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారమే మేడేకు నిజమైన అర్థం భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారమే మేడేకు నిజమైన అర్థం
ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:  ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని మనం ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకుంటున్నాం. కానీ ఈ పండుగకు నిజమైన అర్థం వచ్చేలా కార్మికుల జీవితాల్లో మార్పు రావాలి....
భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారమే మేడేకు సార్థకత
క్రికెట్ క్రీడా పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే
మే డే వాల్ పోస్టర్ విడుదల
ఇందిరమ్మ ఇళ్లతో పేదల కలలు సాకారం
దేశానికి ఆదర్శంగా భూ భారతి చట్టం... 
శ్రీ మహాత్మా బసవేశ్వర జయంతి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి......