మాదిగ ఉపకులాల వనభోజనాలను విజయవంతం చేయాలి.

మాదిగ ఉపకులాల వనభోజనాలను విజయవంతం చేయాలి.

నవంబర్‌ 29న హైదరాబాద్‌ పబ్లిక్‌ గార్డెన్స్‌లో అలై బలై కార్యక్రమం

పిలుపునిచ్చిన బీఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు బోరెల్లి సురేష్‌

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కరపత్రాల ఆవిష్కరణ

హైదరాబాద్‌, నవంబర్‌ 24 (తెలంగాణ ముచ్చట్లు):

మాదిగ ఉపకులాల ఐక్యత, సామాజిక సమైక్యతను చాటిచెప్పేలా నవంబర్‌ 29న నిర్వహించనున్న వనభోజనాల అలై బలై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు బోరెల్లి సురేష్‌ పిలుపునిచ్చారు. ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ డాక్టర్‌ పిడమర్తి రవి ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి మాదిగ ఉపకులాల నాయకులు, విద్యార్థులు, మేధావులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని కోరారు.

మాదిగ విద్యార్థి ఐక్య కార్యాచరణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు జోగు గణేష్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీకమాస వనభోజన కార్యక్రమానికి బోరెల్లి సురేష్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాదిగ ఉపకులాల మధ్య ఐక్యతను మరింత బలోపేతం చేయడంతో పాటు పరస్పర స్నేహభావం, ఆత్మీయతను పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని అన్నారు.

నవంబర్‌ 29న ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు హైదరాబాద్‌లోని పబ్లిక్‌ గార్డెన్స్‌లో మాదిగ ఉపకులాల వనభోజనాలు, అలై బలై కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను మంగళవారం ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్‌ కళాశాల ప్రాంగణంలో ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో మాదిగ విద్యార్థిని ఐక్య కార్యాచరణ సమితి నాయకుడు దేవరకొండ నరేష్‌, రాష్ట్ర కన్వీనర్‌ మీసాల మహేష్‌, బీఎస్‌ఎఫ్‌ ఉస్మానియా విశ్వవిద్యాలయ అధ్యక్షుడు కల్వకుర్తి శ్రీశైలం, ఉపాధ్యక్షుడు ఆరెకంటి శ్రీకాంత్‌, నాయకులు డి. ఓంకార్‌, దేవరపాగ నాగరాజు, సతీష్‌, ఉపేందర్‌, రాజగోపాల్‌, మహేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

సంవిధాన్ రక్షా మార్చ్ విజయానికి తోటకూర వజ్రేష్ యాదవ్ పిలుపు. సంవిధాన్ రక్షా మార్చ్ విజయానికి తోటకూర వజ్రేష్ యాదవ్ పిలుపు.
* సంవిధాన్ రక్షా మార్చ్ విజయవంతానికి ప్రతి డివిజన్ నుంచి 100 మంది తరలిరావాలి   * తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో ప్రతి డివిజన్‌లో కాంగ్రెస్ జెండా...
కుత్బుల్లాపూర్‌ డీఎంహెచ్‌ఓలో ఆకస్మిక తనిఖీలు.
కాంగ్రెస్ పింఛన్లను కేసీఆర్ ఖాతాలో వేయడం సిగ్గుచేటు!
చర్లపల్లిలో ఉచిత యోగా శిబిరానికి విశేష స్పందన.
హనుమకొండ జిల్లాలో విజయవంతమైన పల్స్‌ పోలియో .
నేతాజీ నగర్, శివశక్తి వాసులతో మాజీ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి.
అక్రమ మొరం తరలింపుపై పోలీసుల కొరడా!