మంత్రి పొంగులేటి చొరవతో,గోళ్లపాడుకు కొత్త సొసైటీ..

మంత్రి పొంగులేటి చొరవతో,గోళ్లపాడుకు కొత్త సొసైటీ..

*రైతులకు మరింత చేరువలో సేవలు!*

* వ్యవసాయ సహకార పరపతి సంఘం ఏర్పాటు జీవో విడుదలపై గ్రామస్తుల హర్షం.. 
* క్యాంపు కార్యాలయంలో కృతజ్ఞతలు

ఖమ్మం బ్యూరో, నవంబర్ 23(తెలంగాణ ముచ్చట్లు )

రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చొరవతో ఖమ్మం రూరల్ మండలం గోళ్లపాడులో నూతన వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్‌) ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. దీంతో గ్రామ రైతుల చిరకాల ఆకాంక్ష నెరవేరడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సోమవారం కాంగ్రెస్ పార్టీ ఖమ్మం రూరల్ మండల అధ్యక్షులు తోట వీరభద్రం ఆధ్వర్యంలో గోళ్లపాడు గ్రామస్తులు ఖమ్మంలోని మంత్రి క్యాంపు కార్యాలయానికి చేరుకుని... క్యాంపు కార్యాలయ ఇన్‌ చార్జ్ తుంబూరు దయాకర్‌రెడ్డిని కలిసి శాలువాతో సత్కరించి, మిఠాయిలు పంపిణీ చేశారు. సొసైటీ ఏర్పాటుకు కృషి చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలపాల్సిందిగా కోరారు.
గతంలో ఏదులాపురం పరిధిలోని సొసైటీ ద్వారానే రైతులు సేవలు పొందేవారని, ఇప్పుడు ఖమ్మం రూరల్ మండల రైతులకు మరింత చేరువగా గోళ్లపాడులోనే నూతన సొసైటీ ఏర్పాటు కావడం సంతోషంగా ఉందని గ్రామస్తులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా తుంబూరు దయాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. నూతన సొసైటీకి పీఏసీఎస్‌ కమిటీ ఏర్పాటు చేస్తామని, రైతుల అభ్యున్నతికి అవసరమైన పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.
*ఈ కార్యక్రమంలో..:* మాజీ మార్కెట్ చైర్మన్ మద్ది మల్లారెడ్డి, మద్ది వీరారెడ్డి, ఎల్లారెడ్డి, చంద్రారెడ్డి, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు రుద్ర ఉపేందర్, నాయకులు తేజావత్ పంతులు, మాధవరెడ్డి, తొండల రవి, సింగిరెడ్డి బోసురెడ్డి, కృష్ణమూర్తి, కొప్పుల వెంకటేశ్వర్లు, తాళ్లపెళ్లి వెంకటేశ్వర్లు, గడ్డమీద ఉపేందర్, బొందల నాగార్జున తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే మేఘారెడ్డి. మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే మేఘారెడ్డి.
వనపర్తి,నవంబర్23(తెలంగాణ ముచ్చట్లు): హైదరాబాద్‌లోని మియాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చిన్నమందడి గ్రామానికి చెందిన జనిగే భరత్ మృతి చెందడంపై వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తీవ్ర...
మంత్రి పొంగులేటి చొరవతో,గోళ్లపాడుకు కొత్త సొసైటీ..
హకీంపేటలో 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్-2026 పై కలెక్టర్ సమీక్ష.
జర్నలిస్ట్ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తా.
పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలి.
జర్నలిస్టులకు ప్రత్యేక పెన్షన్, సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలి.
ప్రజావాణి అర్జీలను తక్షణమే పరిష్కరించాలి.