జమ్మికుంటలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా కార్యక్రమానికి శ్రీకారం.

జమ్మికుంటలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా కార్యక్రమానికి శ్రీకారం.

* అర్హులందరూ బీమా నమోదు చేసుకోవాలి

* మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్

జమ్మికుంట, నవంబర్ 20 (తెలంగాణ ముచ్చట్లు):

రాష్ట్రంలోని ప్రతి పేద, మధ్యతరగతి కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదు కార్యక్రమం జమ్మికుంట పట్టణంలో ప్రారంభమైంది. గురువారం జమ్మికుంట పాత మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రతి కుటుంబానికి ఒక భరోసాగా నిలుస్తుందని అన్నారు. కుటుంబ పెద్దకు ఏదైనా అనుకోని ప్రమాదం ఎదురైనప్పుడు ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఇలాంటి బీమా పథకాలు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంతటి మంచి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
పట్టణంలోని ప్రజలందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములై తమ పేర్లను బీమా పథకంలో నమోదు చేసుకోవాలని సూచించారు. ఇందుకోసం తమ తమ వార్డులకు వచ్చే వార్డు అధికారులను సంప్రదించి రేషన్ కార్డు, ఆధార్ కార్డులతో వివరాలు అందించి బీమా నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని కోరారు. అర్హులైన ప్రతి కుటుంబం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి, కౌన్సిలర్లు, మేనేజర్ గుర్రాల రాజిరెడ్డి, వార్డు అధికారులు, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.IMG-20261120-WA0040

Tags:

Post Your Comments

Comments

Latest News

విద్య ద్వారానే వికాసం.. ప్రపంచ దేశాలకు విద్యాభారతి ఆదర్శం. విద్య ద్వారానే వికాసం.. ప్రపంచ దేశాలకు విద్యాభారతి ఆదర్శం.
* భారతీయ సంస్కృతి, సంప్రదాయాలతో కూడిన విలువల విద్యను అందించడమే విద్యాభారతి లక్ష్యం * లింగం సుధాకర్ రెడ్డి జమ్మికుంట, నవంబర్ 20 (తెలంగాణ ముచ్చట్లు): విద్య...
జమ్మికుంటలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా కార్యక్రమానికి శ్రీకారం.
జమ్మికుంట వేదికగా ఎస్ఎఫ్ఐ జిల్లా 19వ మహాసభలు.
మెడికల్ సీటు సాధించిన భవ్యశ్రీకి ఎమ్మెల్యే సత్కారం.
దళిత చైతన్య సభను విజయవంతం చేయాలి.
దేవమ్మ మృతికి వడ్డే శేఖర్ ప్రగాఢ సంతాపం.
ఇందిరమ్మ జీవిత బీమా భరోసా పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి.