కాంగ్రెస్ కు రాజీనామా.. బీఆర్ఎస్ లోకి చెవుల రాకేష్.

కాంగ్రెస్ కు రాజీనామా.. బీఆర్ఎస్ లోకి చెవుల రాకేష్.

మాజీ ఎమ్మెల్యే రాజయ్య ఆధ్వర్యంలో గులాబీ గూటికి చేరిక*

*వెంటనే కొత్తపల్లి గ్రామశాఖ అధ్యక్షుడిగా ఏకగ్రీవ ఎన్నిక*

స్టేషన్ ఘన్ పూర్,అక్టోబర్25(తెలంగాణముచ్చట్లు): 

మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన కంటెస్టెడ్ సర్పంచ్ చెవుల రాకేష్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్ లో చేరారు.ఆదివారం స్టేషన్ ఘన్ పూర్ డివిజన్ కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య ఆధ్వర్యంలో రాకేష్ తో పాటు ఆయన అనుచరులు గులాబీ గూటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువాలు కప్పి బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు.కాంగ్రెస్ పార్టీ విధానాలు, ప్రభుత్వ పాలనా తీరుపై అసంతృప్తితోనే పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు చెవుల రాకేష్ తెలిపారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ పనితీరుపై అసంతృప్తితో తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్ లో చేరినట్లు పేర్కొన్నారు. ఇకపై బీఆర్ఎస్ లో తన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు.బీఆర్ఎస్ లో చేరిన వెంటనే చెవుల రాకేష్ కు పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించారు. పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఆయనను కొత్తపల్లి గ్రామశాఖ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామంలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాల్సిన బాధ్యత రాకేష్ పై పడింది. కాంగ్రెస్ కు రాజీనామా చేసి అనుచరులతో కలిసి బీఆర్ఎస్ లో చేరడం, వెంటనే గ్రామశాఖ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

Tags:

Post Your Comments

Comments

Latest News

బాధ్యతలు స్వీకరించిన నూతన ఎస్ఐ అరుణ్. బాధ్యతలు స్వీకరించిన నూతన ఎస్ఐ అరుణ్.
స్టేషన్ ఘన్ పూర్,అక్టోబర్ 25 (తెలంగాణ ముచ్చట్లు):  స్టేషన్ ఘన్ పూర్ పోలీస్ స్టేషన్ నూతన సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా అరుణ్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా ఎస్ఐ...
మంగంపల్లి ఘటనపై ఎమ్మార్పీఎస్ రౌండ్ టేబుల్ సమావేశం.
అర్హులైన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలి.
విద్యార్థి ప్రతిభకు ఎమ్మెల్యే ఆర్థిక ప్రోత్సాహం.
హుజురాబాద్‌లో వ్యవసాయ మోటార్ చోరీ.
ముప్పారం–వేములవాడకు నూతన బస్సు సర్వీసు ప్రారంభం.
ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై బీఆర్‌ఎస్‌ నేతల ఆరోపణలను ఖండించిన కాంగ్రెస్ నాయకులు.