దమ్మపేట హైస్కూల్లో పోక్సో చట్టంపై అవగాహన సదస్సు.

బాలల రక్షణకు చట్టాలపై అవగాహన అవసరం. - జడ్జి బి. భవాని

దమ్మపేట హైస్కూల్లో పోక్సో చట్టంపై అవగాహన సదస్సు.

IMG-20261024-WA0003

దమ్మపేట, అక్టోబరు 24 (తెలంగాణ ముచ్చట్లు): 

బాలలపై జరిగే లైంగిక వేధింపులను అరికట్టేందుకు పోక్సో చట్టంపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్, జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ బి. భవాని అన్నారు. దమ్మపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం ఆమె ఆధ్వర్యంలో పోక్సో చట్టం, బాలల రక్షణకు సంబంధించిన ఇతర చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం పట్టణంలో అవగాహన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా జడ్జి బి. భవాని మాట్లాడుతూ.. పిల్లలు తమపై ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినా, వేధింపులకు గురిచేసినా భయపడి మౌనంగా ఉండకూడదని సూచించారు. జరిగిన విషయాన్ని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా సంబంధిత పోలీసు అధికారులకు తెలియజేయాలన్నారు. కఠిన పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోవాలని, అవసరమైనప్పుడు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయాలని తెలిపారు. చట్టపరమైన సమస్యలు ఎదురైనప్పుడు అందుబాటులో ఉన్న హెల్ప్‌లైన్ సేవలను వినియోగించుకోవాలని విద్యార్థులకు వివరించారు. సదస్సులో అశ్వారావుపేట, దమ్మపేట పోలీసు సిబ్బంది, దమ్మపేట బార్ అసోసియేషన్ న్యాయవాదులు విద్యార్థులకు పలు చట్టపరమైన అంశాలపై అవగాహన కల్పించారు. బాలలపై లైంగిక వేధింపులు, వాటి నుంచి రక్షణ పొందే మార్గాలు, ఫిర్యాదు చేసే విధానం, చట్టపరమైన సహాయం పొందే పద్ధతులను వివరించారు. సమాజంలో పిల్లలు సురక్షితంగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దమ్మపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గొంది మురళీమోహన్, ప్రధాన కార్యదర్శి లక్కినేని నరేంద్రబాబు, ఉపాధ్యక్షుడు ముప్పిడి శ్యామ్ సుధాకర్, గొల్ల భవాని, కృష్ణ యాదవ్, తామ బాలరాజు, మహిళా న్యాయవాది కాలం సంధ్యారాణి, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, లీగల్ సర్వీసెస్ అథారిటీ సిబ్బంది రాజ్‌కుమార్, అశ్వారావుపేట, దమ్మపేట పోలీసు సిబ్బంది, కోర్టు కానిస్టేబుళ్లు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఎంఈఓ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జమ్మికుంట ఫ్లైఓవర్‌పై గుంతల గండం! జమ్మికుంట ఫ్లైఓవర్‌పై గుంతల గండం!
జమ్మికుంట, అక్టోబర్ 24 (తెలంగాణ ముచ్చట్లు): జమ్మికుంట పట్టణంలోని ఫ్లైఓవర్‌పై రహదారి గుంతలమయంగా మారి వాహనదారులకు ప్రమాదకరంగా పరిణమిస్తోంది. పలుచోట్ల తారు పొర దెబ్బతిని గుంతలు ఏర్పడటంతో...
దమ్మపేట హైస్కూల్లో పోక్సో చట్టంపై అవగాహన సదస్సు.
కొత్త నోములకు ఈ ఏడాది అనుమతి లేదు.. సిద్ధాంతి వెల్లడి.
బీజేపీ బలోపేతమే లక్ష్యంగా ముందుకు సాగాలి!
పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటర్లుగా నమోదు కావాలి.
రాజవరంలో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమం.
నూతన ఎస్సై శ్రావణ్‌కు నాయకుల శుభాకాంక్షలు.