ఒరిజినల్ సర్టిఫికెట్లు పోగొట్టుకున్న మహిళ.

ఒరిజినల్ సర్టిఫికెట్లు పోగొట్టుకున్న మహిళ.

పెద్దమందడి,అక్టోబర్23(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం దొడగుంటపల్లి గ్రామానికి చెందిన జి. వరలక్ష్మి (తండ్రి ఆశన్న) తన ఒరిజినల్ విద్యార్హత సర్టిఫికెట్లు పోగొట్టుకున్నట్లు శుక్రవారం ఒక ప్రకటనలో ఆమె తెలిపారు. అక్టోబర్ 10న దొడగుంటపల్లి నుంచి వనపర్తికి బైక్‌పై వెళ్తుండగా మార్గమధ్యంలోని జంగమయపల్లి సమీపంలో తన సర్టిఫికెట్లు పడిపోయినట్లు ఆమె పేర్కొన్నారు.పోగొట్టుకున్న సర్టిఫికెట్లలో ఎస్‌ఎస్‌సీ మెమో, ఇంటర్మీడియట్ మెమో, ఏఎన్‌ఎం ఒరిజినల్ సర్టిఫికెట్లు ఉన్నాయని తెలిపారు. ప్రయాణం అనంతరం సర్టిఫికెట్లు కనిపించకపోవడంతో మార్గమధ్యంలో వెతికినప్పటికీ ఆచూకీ లభించలేదని వెల్లడించారు. విద్యార్హతకు సంబంధించిన ముఖ్యమైన పత్రాలు కావడంతో వాటి కోసం ఆందోళన చెందుతున్నట్లు వరలక్ష్మి తెలిపారు.ఎవరైనా ఈ సర్టిఫికెట్లను గుర్తించినా, దొరికినా దయచేసి తిరిగి అందించి సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. సర్టిఫికెట్లు లభించినవారు 9949811602 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించాలని జి. వరలక్ష్మి కోరారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయమే లక్ష్యం! పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయమే లక్ష్యం!
ధర్మసాగర్,అక్టోబర్ 23 (తెలంగాణ ముచ్చట్లు):  రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ ఎన్నికల సన్నాహాలను ముమ్మరం చేస్తోంది. ఈ...
రైతులకు అదనపు ధర.. పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం.
బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కేసులు నమోదు.
రైల్వే బోర్డు సభ్యుల కు వినతి పత్రం సమర్పించిన రైల్వే జేఏసీ .
కన్నవారే కాదంటే.. వృద్ధులకు మేమున్నామంటూ బాలవికాస భరోసా!
ఎర్రబెల్లి సంపత్ రావుకు బీజేపీ జిల్లా ఉపాధ్యక్ష పదవి.. మూడోసారి అవకాశం!
ఎండిపోతున్న పంటలకు జీవజలం.