సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షుడిగా పాపయ్య గౌడ్!
Views: 11
On
స్టేషన్ ఘన్‌పూర్,అక్టోబర్ 10 (తెలంగాణ ముచ్చట్లు):
సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షుడిగా చెరుకు పాపయ్య గౌడ్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆయన తనకు అప్పగించిన బాధ్యతల పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, తనపై నమ్మకం ఉంచి ఈ అవకాశం కల్పించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.తన నియామకానికి సహకరించిన సౌడ రమేష్, తోకల ఉమారాణిలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే తనకు అండగా నిలిచిన ఉడుగుల రమేష్, సట్ల వెంకటరమణ, బొజ్జపల్లి సుభాష్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.
తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని పాపయ్య గౌడ్ పేర్కొన్నారు. సాంస్కృతిక రంగ అభివృద్ధికి, కళాకారులను ప్రోత్సహించడానికి అంకితభావంతో పనిచేస్తానని స్పష్టం చేశారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
10 Oct 2026 21:38:16
చిల్పూర్,అక్టోబర్ 10 (తెలంగాణ ముచ్చట్లు):
మండలంలోని పల్లగుట్ట గ్రామంలో రైతుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఐకేపీ కేంద్రాన్ని ఘనంగా ప్రారంభించారు. తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి, స్థానిక...


Comments