ఓటు హక్కు పరిరక్షణ కోసం యూత్ కాంగ్రెస్ పోరు.

ఓటు హక్కు పరిరక్షణ కోసం యూత్ కాంగ్రెస్ పోరు.

* రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ అరెస్టులకు నిరసనగా జమ్మికుంటలో మహా ధర్నా, రాస్తారోకో

* జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి

* యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి సజ్జద్ మహమ్మద్

జమ్మికుంట, అక్టోబర్ 09 (తెలంగాణ ముచ్చట్లు):

కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రాలపై జరిగిన దాడి, వారి అరెస్టులను ఖండిస్తూ జమ్మికుంటలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి. కరీంనగర్ జిల్లా యూత్ కాంగ్రెస్ కార్యదర్శి సజ్జద్ మహమ్మద్ నేతృత్వంలో శుక్రవారం మహా ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, పౌరుల ఓటు హక్కును పరిరక్షించాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా సజ్జద్ మహమ్మద్ మాట్లాడుతూ.. దేశంలో రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువల నిలుపుదల కోసమే రాహుల్ గాంధీ పోరాడుతున్నారని అన్నారు. ఈ పోరాటం ఏ ఒక్క పార్టీకి, వ్యక్తికి పరిమితమైనది కాదని, దేశ ప్రజల హక్కులను కాపాడేందుకేనని స్పష్టం చేశారు. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ప్రయత్నించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వం నిరంకుశ ధోరణితో వ్యవహరిస్తూ సామాన్య ప్రజల ఓటు హక్కుకు విఘాతం కలిగిస్తోందని ఆరోపించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను బలహీనపరిచే చర్యలను సహించబోమని, ప్రజల హక్కుల పరిరక్షణ కోసం కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ పోరాటం నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి చోటుచేసుకుంటున్న పరిణామాలకు బాధ్యత వహిస్తూ ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ నాయకులపై దాడులు, అక్రమ అరెస్టులు కొనసాగితే యూత్ కాంగ్రెస్ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అవసరమైతే జమ్మికుంట కేంద్రంగా ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని తెలిపారు.
ఈ నిరసన కార్యక్రమంలో జమ్మికుంట మున్సిపల్ కాంగ్రెస్ కౌన్సిలర్ చంద రాజు, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు చిన్నాల శ్రీకాంత్, దౌలత్, ప్రధాన కార్యదర్శులు శనిగరపు తరుణ్, పంజాల అజయ్, పాతకాల రమేష్, ఎన్‌ఎస్‌యూఐ కరీంనగర్ జిల్లా కార్యదర్శి పర్వేజ్, యూత్ కాంగ్రెస్ జమ్మికుంట మండల అధ్యక్షుడు బూడిగే శ్రీకాంత్, ఉపాధ్యక్షులు రాచపల్లి సాగర్, వేవునూరి వినయ్, అకినపల్లి శ్యామ్ కళ్యాణ్, సేవాదళ్ మండల అధ్యక్షుడు రామకృష్ణ, మండల ప్రధాన కార్యదర్శులు వొళ్ళాల రవి, టెంకురాల కిషోర్, మరపల్లి అజయ్, రాజేష్, ఇమ్రాన్, రాచపల్లి రాజశేఖర్, శనిగరపు రాజు, శివ, కోలుగురి రవి, సమీర్, సందీప్, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు బాబర్, రాజు, అభిషేక్, రాజవంశన్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.IMG-20261009-WA0030

Tags:

Post Your Comments

Comments

Latest News

పల్లగుట్టలో ఐకేపీ కేంద్రం ప్రారంభం. పల్లగుట్టలో ఐకేపీ కేంద్రం ప్రారంభం.
చిల్పూర్,అక్టోబర్ 10 (తెలంగాణ ముచ్చట్లు):  మండలంలోని పల్లగుట్ట గ్రామంలో రైతుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఐకేపీ కేంద్రాన్ని ఘనంగా ప్రారంభించారు. తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి, స్థానిక...
పల్లెపల్లెనా పూల జాతర!
ఘనపూర్‌లో ఆరు అడుగుల భారీ బతుకమ్మ!
పంచాయతీ కార్యదర్శి సంతకం ఫోర్జరీ చేసినట్లు ఫిర్యాదు.
శ్రీకృష్ణ యూత్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు.
.తాటికాయలలో ఘనంగా ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు.
పీచరలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు.