ఏకేవీఆర్ కళాశాలలో ఘనంగా ముందస్తు బతుకమ్మ సంబరాలు.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణే లక్ష్యం.

ఏకేవీఆర్ కళాశాలలో ఘనంగా ముందస్తు బతుకమ్మ సంబరాలు.

భీమదేవరపల్లి, అక్టోబర్ 9 (తెలంగాణ ముచ్చట్లు):

హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌లోని ఏకేవీఆర్ జూనియర్, డిగ్రీ కళాశాలల్లో ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో ముందస్తు బతుకమ్మ సంబరాలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ భూపతి శ్రీకాంత్ నేతృత్వంలో జరిగిన ఈ వేడుకలు విద్యార్థినుల ఉత్సాహంతో పండుగ వాతావరణాన్ని సంతరించుకున్నాయి.

ఈ సందర్భంగా విద్యార్థినులు రంగురంగుల పూలతో అందమైన బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ బతుకమ్మ ఆటపాటలతో సందడి చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ విశిష్టతను, ప్రకృతికి మానవ జీవనానికి ఉన్న అనుబంధాన్ని విద్యార్థినులకు వివరించారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ భూపతి శ్రీకాంత్ మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పట్ల విద్యార్థుల్లో అవగాహన పెంపొందించడంతో పాటు, మన పండుగల గొప్పతనాన్ని భావితరాలకు తెలియజేయడమే ఇటువంటి కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. విద్యార్థులు తమ సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ వాటి పరిరక్షణకు కృషి చేయాలని సూచించారు.

విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొనడంతో కళాశాల ప్రాంగణమంతా బతుకమ్మ పాటలు, ఆటలతో సందడిగా మారింది. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

Tags:

Post Your Comments

Comments

Latest News

పల్లగుట్టలో ఐకేపీ కేంద్రం ప్రారంభం. పల్లగుట్టలో ఐకేపీ కేంద్రం ప్రారంభం.
చిల్పూర్,అక్టోబర్ 10 (తెలంగాణ ముచ్చట్లు):  మండలంలోని పల్లగుట్ట గ్రామంలో రైతుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఐకేపీ కేంద్రాన్ని ఘనంగా ప్రారంభించారు. తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి, స్థానిక...
పల్లెపల్లెనా పూల జాతర!
ఘనపూర్‌లో ఆరు అడుగుల భారీ బతుకమ్మ!
పంచాయతీ కార్యదర్శి సంతకం ఫోర్జరీ చేసినట్లు ఫిర్యాదు.
శ్రీకృష్ణ యూత్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు.
.తాటికాయలలో ఘనంగా ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు.
పీచరలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు.