చేయూత పింఛన్ల తనిఖీలో వేగం పెంచాలి.

ఫతేపూర్‌లో ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా పంచాయతీ అధికారి వెంకట్ రెడ్డి.

చేయూత పింఛన్ల తనిఖీలో వేగం పెంచాలి.

చిల్పూర్,అక్టోబర్ 09 (తెలంగాణ ముచ్చట్లు): 

మండలంలోని ఫతేపూర్ గ్రామ పంచాయతీలో చేయూత పింఛన్ల లబ్ధిదారుల వివరాల పరిశీలనను జిల్లా పంచాయతీ అధికారి వెంకట్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గుగులోతు లక్ష్మీ ఊమ్లా నాయక్ ఆయనకు స్వాగతం పలికి సన్మానించారు.పరిశీలనలో భాగంగా యాదృచ్ఛికంగా ఎంపిక చేసిన లబ్ధిదారుల వివరాలను డీపీఓ స్వయంగా తనిఖీ చేశారు. క్షేత్రస్థాయిలో పింఛన్ల లబ్ధిదారుల వివరాల పరిశీలన ఏ విధంగా జరుగుతోందనే విషయాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పరిశీలన ప్రక్రియను వేగవంతం చేస్తూ, వివరాలను క్షుణ్ణంగా ధ్రువీకరించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో గార్లగడ్డ సర్పంచ్ నవీన్, ఎంపీవో రఘురామకృష్ణ, పంచాయతీ కార్యదర్శులు రాజేందర్, శ్రీకాంత్, ఉప సర్పంచ్ రంగమ్మ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

పల్లగుట్టలో ఐకేపీ కేంద్రం ప్రారంభం. పల్లగుట్టలో ఐకేపీ కేంద్రం ప్రారంభం.
చిల్పూర్,అక్టోబర్ 10 (తెలంగాణ ముచ్చట్లు):  మండలంలోని పల్లగుట్ట గ్రామంలో రైతుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఐకేపీ కేంద్రాన్ని ఘనంగా ప్రారంభించారు. తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి, స్థానిక...
పల్లెపల్లెనా పూల జాతర!
ఘనపూర్‌లో ఆరు అడుగుల భారీ బతుకమ్మ!
పంచాయతీ కార్యదర్శి సంతకం ఫోర్జరీ చేసినట్లు ఫిర్యాదు.
శ్రీకృష్ణ యూత్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు.
.తాటికాయలలో ఘనంగా ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు.
పీచరలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు.