ఎంగిలిపూల బతుకమ్మకు ఏర్పాట్లు పూర్తి.

ఎంగిలిపూల బతుకమ్మకు ఏర్పాట్లు పూర్తి.

ఆడపడుచులకు బతుకమ్మ శుభాకాంక్షలు

మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్

స్టేషన్ ఘన్‌పూర్,అక్టోబర్ 09 (తెలంగాణ ముచ్చట్లు): 

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగలో మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలకు స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పితృ అమావాస్య సందర్భంగా నిర్వహించే ఈ వేడుకలను మహిళలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకునేందుకు అవసరమైన సౌకర్యాలను కల్పించారు.
మున్సిపాలిటీ పరిధిలోని స్టేషన్ ఘన్‌పూర్, చాగల్లు, శివునిపల్లి ప్రాంతాల్లో మహిళలు బతుకమ్మలు ఆడుకునే ప్రదేశాలను చదును చేయించి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. వేడుకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విద్యుత్ దీపాల ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్ మాట్లాడుతూ, తెలంగాణ ఆడపడుచులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే బతుకమ్మ పండుగకు మున్సిపాలిటీ తరఫున అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలను విజయవంతం చేయాలని కోరారు. ఆడపడుచులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ ఏర్పాట్లను మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్, కమిషనర్ బండ్ల రాధాకృష్ణ ఆధ్వర్యంలో చేపట్టారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

పల్లగుట్టలో ఐకేపీ కేంద్రం ప్రారంభం. పల్లగుట్టలో ఐకేపీ కేంద్రం ప్రారంభం.
చిల్పూర్,అక్టోబర్ 10 (తెలంగాణ ముచ్చట్లు):  మండలంలోని పల్లగుట్ట గ్రామంలో రైతుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఐకేపీ కేంద్రాన్ని ఘనంగా ప్రారంభించారు. తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి, స్థానిక...
పల్లెపల్లెనా పూల జాతర!
ఘనపూర్‌లో ఆరు అడుగుల భారీ బతుకమ్మ!
పంచాయతీ కార్యదర్శి సంతకం ఫోర్జరీ చేసినట్లు ఫిర్యాదు.
శ్రీకృష్ణ యూత్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు.
.తాటికాయలలో ఘనంగా ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు.
పీచరలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు.