వార్డు మెంబర్ల ఫోరం కో-ఇన్‌చార్జిగా జిల్లెల్ల శ్రీపాల్ రెడ్డి.

వార్డు మెంబర్ల ఫోరం కో-ఇన్‌చార్జిగా జిల్లెల్ల శ్రీపాల్ రెడ్డి.

జమ్మికుంట, అక్టోబర్ 09 (తెలంగాణ ముచ్చట్లు):

తెలంగాణ రాష్ట్ర వార్డు మెంబర్ల ఫోరం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గ కో-ఇన్‌చార్జిగా జిల్లెల్ల శ్రీపాల్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు నాగవెల్లి జ్యోతి మహేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ.. హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని వార్డు మెంబర్లను సమన్వయం చేసుకుంటూ, వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. వార్డు మెంబర్ల హక్కుల పరిరక్షణతో పాటు, వారు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తెలంగాణ రాష్ట్ర వార్డు మెంబర్ల ఫోరం ఆధ్వర్యంలో నిరంతరం పనిచేస్తానని పేర్కొన్నారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన ఫోరం నాయకత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ, తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని వెల్లడించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

పల్లగుట్టలో ఐకేపీ కేంద్రం ప్రారంభం. పల్లగుట్టలో ఐకేపీ కేంద్రం ప్రారంభం.
చిల్పూర్,అక్టోబర్ 10 (తెలంగాణ ముచ్చట్లు):  మండలంలోని పల్లగుట్ట గ్రామంలో రైతుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఐకేపీ కేంద్రాన్ని ఘనంగా ప్రారంభించారు. తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి, స్థానిక...
పల్లెపల్లెనా పూల జాతర!
ఘనపూర్‌లో ఆరు అడుగుల భారీ బతుకమ్మ!
పంచాయతీ కార్యదర్శి సంతకం ఫోర్జరీ చేసినట్లు ఫిర్యాదు.
శ్రీకృష్ణ యూత్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు.
.తాటికాయలలో ఘనంగా ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు.
పీచరలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు.