రేవల్లి పాఠశాల ప్రాంగణంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.

రేవల్లి పాఠశాల ప్రాంగణంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.

రేవల్లి,అక్టోబర్09(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా రేవల్లి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకొని విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు.మధ్యాహ్నం 2 గంటల నుంచి వివిధ రకాల రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, పాఠశాల ప్రాంగణంలో పండుగ వాతావరణాన్ని నెలకొల్పారు. అనంతరం బతుకమ్మకు పూజలు నిర్వహించి, నైవేద్యం సమర్పించారు. రేవల్లి తహసీల్దార్  సరస్వతి కొబ్బరికాయతో నైవేద్యం సమర్పించగా, మండల అభివృద్ధి అధికారిణి కుమారి కీర్తన దీపాలు వెలిగించి వేడుకలను ప్రారంభించారు.అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులు బతుకమ్మ పాటలు పాడుతూ, బతుకమ్మ చుట్టూ తిరుగుతూ సంప్రదాయబద్ధంగా సంబరాలు జరుపుకున్నారు. ఆటపాటలతో పాఠశాల ప్రాంగణం సందడిగా మారింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తహసీల్దార్ శ్రీమతి సరస్వతి, మండల అభివృద్ధి అధికారిణి కుమారి కీర్తన, మండల విద్యాధికారి ఎస్. వరప్రసాద్ రావు, పాఠశాల సముదాయ ప్రధానోపాధ్యాయులు పి. ప్రసాద్, పీఎం శ్రీ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి సరోజ హాజరయ్యారు. మండల సీఆర్‌పీ రమేష్, ఎంఐఎస్ కోఆర్డినేటర్ లావణ్య, మెసెంజర్ శ్రీనివాసులు, వివిధ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో, సంతోషంగా పండుగలను జరుపుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా అందరికీ ముందస్తు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

పల్లగుట్టలో ఐకేపీ కేంద్రం ప్రారంభం. పల్లగుట్టలో ఐకేపీ కేంద్రం ప్రారంభం.
చిల్పూర్,అక్టోబర్ 10 (తెలంగాణ ముచ్చట్లు):  మండలంలోని పల్లగుట్ట గ్రామంలో రైతుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఐకేపీ కేంద్రాన్ని ఘనంగా ప్రారంభించారు. తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి, స్థానిక...
పల్లెపల్లెనా పూల జాతర!
ఘనపూర్‌లో ఆరు అడుగుల భారీ బతుకమ్మ!
పంచాయతీ కార్యదర్శి సంతకం ఫోర్జరీ చేసినట్లు ఫిర్యాదు.
శ్రీకృష్ణ యూత్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు.
.తాటికాయలలో ఘనంగా ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు.
పీచరలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు.