పితృపక్షాల వేళ అన్నదానానికి పెద్దపీట!
Views: 129
On
స్టేషన్ ఘన్‌పూర్,అక్టోబర్ 09(తెలంగాణ ముచ్చట్లు):
పితృపక్షాల సందర్భంగా స్టేషన్ ఘన్‌పూర్ పట్టణంలోని బస్టాండ్ వద్ద శుక్రవారం అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పితృపక్షాల వేళ అన్నదానం చేయడం ద్వారా సేవాభావాన్ని చాటుకుంటూ కార్యక్రమ నిర్వాహకులు అన్నప్రసాద వితరణ చేపట్టారు.
పట్టణానికి చెందిన తాళ్లపల్లి సత్యనారాయణ, గుండేటి సంపత్, అంచురి భాస్కర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బస్టాండ్ పరిసర ప్రాంతాలకు వచ్చిన స్థానికులు, ప్రయాణికులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు.ఈ కార్యక్రమంలో మాధరావు సురేష్, అడ్డగూడెం సతీష్, గట్టు రవి తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
10 Oct 2026 21:38:16
చిల్పూర్,అక్టోబర్ 10 (తెలంగాణ ముచ్చట్లు):
మండలంలోని పల్లగుట్ట గ్రామంలో రైతుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఐకేపీ కేంద్రాన్ని ఘనంగా ప్రారంభించారు. తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి, స్థానిక...


Comments