శివునిపల్లిలో విశ్వబ్రాహ్మణుల ఐక్యతా సందడి!
గ్రామ అధ్యక్షుడిగా కేషోజు అమరేందర్ ఏకగ్రీవ ఎన్నిక
ఘనంగా నియామక పత్రం అందజేత.. కులబాంధవుల్లో హర్షం
స్టేషన్ ఘన్‌పూర్,అక్టోబర్ 09(తెలంగాణ ముచ్చట్లు):
విశ్వకర్మ విశ్వబ్రాహ్మణుల ఐక్యతకు నిదర్శనంగా స్టేషన్ ఘన్‌పూర్ మండలం శివునిపల్లి గ్రామంలో శుక్రవారం విశ్వబ్రాహ్మణ సంఘం సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దల సమక్షంలో విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ ఐక్య సంఘం గ్రామ అధ్యక్షుడిగా కేషోజు అమరేందర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
అనంతరం మండల అధ్యక్షుడు కాసోజు రవీందర్, గౌరవాధ్యక్షుడు మారేడుపాక ఉమాశంకర్, కార్యదర్శి దిగోజి రాజేష్, ప్రచార కార్యదర్శి కాసోజు శ్రీనివాస్‌తో పాటు గ్రామ పెద్దలు నూతన అధ్యక్షుడు అమరేందర్‌కు నియామక పత్రాన్ని అందజేసి అభినందించారు.ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు కేషోజు అమరేందర్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన కులబాంధవులకు కృతజ్ఞతలు తెలిపారు. వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ విశ్వబ్రాహ్మణుల అభివృద్ధికి, సంఘం బలోపేతానికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కులబాంధవులంతా ఐక్యంగా ఉంటూ సంఘ అభివృద్ధికి సహకరించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ కులబాంధవులు, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ‘జై విశ్వకర్మ.. జై జై విశ్వకర్మ’ నినాదాలతో గ్రామంలో సందడి నెలకొంది.


Comments