చైనాలో సత్తా చాటిన ఘనపూర్ బిడ్డ!

చైనాలో సత్తా చాటిన ఘనపూర్ బిడ్డ!

IMG-20261010-WA0008అంతర్జాతీయ వడ్రంగి పోటీల్లో ఐదో స్థానం.. 

విశ్వనాథపురం యువకుడి ఘనత

స్టేషన్ ఘన్‌పూర్,అక్టోబర్ 10 (తెలంగాణ ముచ్చట్లు): 

చైనాలో 25 దేశాల మధ్య జరిగిన అంతర్జాతీయ వడ్రంగి పోటీల్లో స్టేషన్ ఘన్‌పూర్ మండలం విశ్వనాథపురం గ్రామానికి చెందిన కేసోజు యశ్వంత్ చారి ఐదో స్థానం సాధించి అంతర్జాతీయ వేదికపై తన ప్రతిభను చాటుకున్నారు. ఈ ఘనతతో గ్రామానికి, దేశానికి గర్వకారణంగా నిలిచారు.కేసోజు యాదగిరి, వెంకటమ్మ దంపతుల పెద్ద కుమారుడైన యశ్వంత్ చారి, బ్రహ్మం మనవడిగా కుటుంబ నేపథ్యంతో పాటు తన వృత్తి నైపుణ్యంతో ప్రత్యేక గుర్తింపు పొందారు. జాతీయ స్థాయి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం ద్వారా ఎంపికైన ఆయన అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని తన ప్రతిభను నిరూపించుకున్నారు.
సాంప్రదాయ వృత్తులు క్రమంగా కనుమరుగవుతున్న ప్రస్తుత తరుణంలో, వడ్రంగి వృత్తిపై ఆసక్తి, పట్టుదల, నైపుణ్యం ఉంటే ప్రపంచ స్థాయిలోనూ గుర్తింపు సాధించవచ్చని యశ్వంత్ చారి నిరూపించారని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయన సాధించిన విజయం గ్రామ యువతకు స్ఫూర్తిదాయకమని కొనియాడుతున్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

పల్లగుట్టలో ఐకేపీ కేంద్రం ప్రారంభం. పల్లగుట్టలో ఐకేపీ కేంద్రం ప్రారంభం.
చిల్పూర్,అక్టోబర్ 10 (తెలంగాణ ముచ్చట్లు):  మండలంలోని పల్లగుట్ట గ్రామంలో రైతుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఐకేపీ కేంద్రాన్ని ఘనంగా ప్రారంభించారు. తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి, స్థానిక...
పల్లెపల్లెనా పూల జాతర!
ఘనపూర్‌లో ఆరు అడుగుల భారీ బతుకమ్మ!
పంచాయతీ కార్యదర్శి సంతకం ఫోర్జరీ చేసినట్లు ఫిర్యాదు.
శ్రీకృష్ణ యూత్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు.
.తాటికాయలలో ఘనంగా ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు.
పీచరలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు.