వెల్టూర్‌లో మంత్రుల పర్యటన విజయవంతం.
గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రేమ్ సాగర్.
పెద్దమందడి,సెప్టెంబర్28(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామంలో జరిగిన మంత్రుల పర్యటన విజయవంతమైందని గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రేమ్ సాగర్ తెలిపారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల సమష్టి కృషితో మంత్రులకు ఘన స్వాగతం పలికి, భారీ బైక్ ర్యాలీ నిర్వహించామని ఆయన పేర్కొన్నారు. అనంతరం మంత్రుల చేతుల మీదుగా తెలంగాణ పబ్లిక్ స్కూల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన జరగడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రేమ్ సాగర్, వడ్డే శేఖర్, బాబు రెడ్డి, దిండు రవీందర్ కీలకంగా వ్యవహరించారు. వీరి సమన్వయంతో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి బైక్ ర్యాలీలో పాల్గొని మంత్రులకు ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ప్రేమ్ సాగర్ మాట్లాడుతూ.. మంత్రుల పర్యటనను విజయవంతం చేసేందుకు కృషి చేసిన నాయకులు, కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. బైక్ ర్యాలీతో పాటు మంత్రుల చేతుల మీదుగా తెలంగాణ పబ్లిక్ స్కూల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన జరగడం వెల్టూర్ గ్రామానికి సంతోషకరమైన విషయమన్నారు.వెల్టూర్ గ్రామ అభివృద్ధికి సహకరిస్తూ పాఠశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన జరిగేలా కృషి చేసిన ఎమ్మెల్యే మేఘా రెడ్డికి ప్రేమ్ సాగర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ అభివృద్ధి కోసం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేస్తారని ఆయన పేర్కొన్నారు.


Comments