హక్కుల కోసం ఆందోళన చేసిన ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల అరెస్టు.

వైద్య విధాన పరిషత్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. డబీర్‌పుర పోలీస్‌స్టేషన్‌కు తరలింపు.

హక్కుల కోసం ఆందోళన చేసిన ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల అరెస్టు.

వనపర్తి,సెప్టెంబర్28(తెలంగాణ ముచ్చట్లు):

ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల న్యాయమైన హక్కులు, డిమాండ్ల పరిష్కారం కోసం ఆందోళన చేపట్టిన ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేసి దబీర్‌పుర పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. హైదరాబాద్ కోటిలోని వైద్య విధాన పరిషత్ కార్యాలయం వద్ద సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది.గత 20 సంవత్సరాలుగా వివిధ హోదాల్లో, వివిధ జిల్లాల్లో 17 వేల మందికి పైగా ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారని వనపర్తి జిల్లా సమన్వయకర్త ఖాజా హుస్సేన్ తెలిపారు. ఉద్యోగుల న్యాయమైన హక్కులు, ఉద్యోగ భద్రత, ఇతర డిమాండ్ల పరిష్కారం కోసం సంబంధిత అధికారులను కలిసి వినతిపత్రం సమర్పించడంతో పాటు సమ్మె నోటీసు అందజేయడానికి కమిషనర్ కార్యాలయానికి వెళ్లినట్లు చెప్పారు.ఈ సందర్భంగా ఖాజా హుస్సేన్ మాట్లాడుతూ.. ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లేందుకు, తమ డిమాండ్లపై వినతిపత్రం అందజేసేందుకు ఉద్యోగులు పెద్ద సంఖ్యలో కార్యాలయానికి చేరుకున్నారని తెలిపారు. అయితే కమిషనర్ అందుబాటులో లేకపోవడంతో ఇన్‌చార్జి కమిషనర్ లేదా ముఖ్య కార్యక్రమ అధికారి అయినా తమను కలిసి వినతిపత్రం స్వీకరించాలని కోరినట్లు చెప్పారు.అధికారులను ఆందోళన ప్రదేశానికి వచ్చి ఉద్యోగుల సమస్యలను వినాలని కోరినప్పటికీ వారు రాకపోవడంతో ఉద్యోగులు తమ నిరసనను వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారని ఖాజా హుస్సేన్ తెలిపారు. ఈ క్రమంలో అక్కడ ఉన్న పోలీసు సిబ్బంది ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులను అరెస్టు చేసి డబీర్‌పుర పోలీస్‌స్టేషన్‌కు తరలించారని పేర్కొన్నారు.20 ఏళ్లుగా వివిధ ప్రాంతాల్లో సేవలందిస్తున్న 17 వేల మందికి పైగా ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల న్యాయమైన హక్కులు, డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని ఖాజా హుస్సేన్ కోరారు. ఉద్యోగులతో చర్చలు జరిపి సమస్యలకు పరిష్కారం చూపాలని, తమ డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా సమన్వయకర్త ఖాజా హుస్సేన్‌తో పాటు ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మతిస్థిమితం లేని బాలుడిని  అన్నం సేవా ఫౌండేషన్‌ అప్పగించిన ఎస్ ఐ. మతిస్థిమితం లేని బాలుడిని  అన్నం సేవా ఫౌండేషన్‌ అప్పగించిన ఎస్ ఐ.
ఖమ్మం బ్యూరో, సెప్టెంబర్ 28(తెలంగాణ ముచ్చట్లు ) నాగులవంచ గ్రామంలో కొన్ని రోజులుగా రోడ్డు పై మతిస్థిమితం లేని బాలుడు తిరుగుతున్న విషయాన్ని స్థానికులు ద్వారా తెలుసుకున్న...
టిఫిన్ కోసం వెళ్లిన తండ్రి.. కారులో చిన్నారి లాక్.
కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ శ్రేణుల నిరసన.
నిరుపేదల ఇళ్ల సమస్య పరిష్కరించాలి.
మత్తుల వాగుపై వంతెన నిర్మించాలి.
గొర్రెలు, మేకల పెంపకందారుల సమస్యలు పరిష్కరించాలి.
చాగల్లు నుంచి కొండగట్టుకు హనుమాన్ మాల స్వాములు.