గొర్రెలు, మేకల పెంపకందారుల సమస్యలు పరిష్కరించాలి.

ఎంపీడీవోకు వినతిపత్రం సమర్పించిన సంఘం ప్రతినిధులు.

గొర్రెలు, మేకల పెంపకందారుల సమస్యలు పరిష్కరించాలి.

చిల్పూర్, సెప్టెంబర్ 28 (తెలంగాణ ముచ్చట్లు): 

గొర్రెలు, మేకల పెంపకందారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఇన్‌చార్జి ఎంపీడీవో కిరణ్ ప్రసాద్‌కు వినతిపత్రం సమర్పించారు. మండల కేంద్రంలో వివిధ గ్రామాలకు చెందిన సహకార సంఘాల అధ్యక్షులు, సభ్యులు ఎంపీడీవోను కలిసి తమ సమస్యలను వివరించారు.

ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు సాదం రమేష్ మాట్లాడుతూ గొల్ల, కురుమల ప్రధాన వృత్తి అయిన గొర్రెల పెంపకానికి ప్రభుత్వం నుంచి తగిన మద్దతు లభించడం లేదన్నారు. మండలంలోని గొర్రెలు, మేకల సహకార సంఘాలకు పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని కోరారు. గొర్రె లేదా మేక మృతి చెందితే ప్రస్తుతం అందిస్తున్న రూ.3 వేల పరిహారాన్ని రూ.20 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వ భూములు, చెరువు శిఖం ప్రాంతాల్లోని తుమ్మ చెట్లను జీవో 559, 1016 ప్రకారం సహకార సంఘాలకే కేటాయించాలని కోరారు. 50 ఏళ్లు దాటిన పెంపకందారులకు నెలకు రూ.5 వేల పింఛను అందించాలని, పశువైద్యశాలల్లో అవసరమైన టీకాలు, మందులు అందుబాటులో ఉంచాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు అపారదాపు రాజు, రవీందర్, వివిధ గ్రామాల సహకార సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మతిస్థిమితం లేని బాలుడిని  అన్నం సేవా ఫౌండేషన్‌ అప్పగించిన ఎస్ ఐ. మతిస్థిమితం లేని బాలుడిని  అన్నం సేవా ఫౌండేషన్‌ అప్పగించిన ఎస్ ఐ.
ఖమ్మం బ్యూరో, సెప్టెంబర్ 28(తెలంగాణ ముచ్చట్లు ) నాగులవంచ గ్రామంలో కొన్ని రోజులుగా రోడ్డు పై మతిస్థిమితం లేని బాలుడు తిరుగుతున్న విషయాన్ని స్థానికులు ద్వారా తెలుసుకున్న...
టిఫిన్ కోసం వెళ్లిన తండ్రి.. కారులో చిన్నారి లాక్.
కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ శ్రేణుల నిరసన.
నిరుపేదల ఇళ్ల సమస్య పరిష్కరించాలి.
మత్తుల వాగుపై వంతెన నిర్మించాలి.
గొర్రెలు, మేకల పెంపకందారుల సమస్యలు పరిష్కరించాలి.
చాగల్లు నుంచి కొండగట్టుకు హనుమాన్ మాల స్వాములు.