ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని ఉన్న ఇల్లు కూల్చేశారు.

ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని ఉన్న ఇల్లు కూల్చేశారు.

ఇప్పగూడెంలో రోడ్డున పడ్డ వృద్ధ దంపతులు

వృద్ధ దంపతులను ఆదుకోవాలి

తెలంగాణ రక్షణ సేన నియోజకవర్గ ఇన్‌చార్జి చిలుక ప్రవీణ్

స్టేషన్ ఘన్‌పూర్, సెప్టెంబర్ 28 (తెలంగాణ ముచ్చట్లు): 

ఇందిరమ్మ ఇల్లు మంజూరవుతుందన్న హామీని నమ్మి ఉన్న ఇంటిని కూల్చుకున్న వృద్ధ దంపతులు ప్రస్తుతం రేకుల షెడ్డులో, దిక్కుతోచని స్థితిలో జీవిస్తున్నారని తెలంగాణ రక్షణ సేన స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి చిలుక ప్రవీణ్ తెలిపారు. బాధిత వృద్ధ దంపతులకు వెంటనే న్యాయం చేసి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ మండలం ఇప్పగూడెం గ్రామానికి చెందిన నిరుపేద దంపతులు కోలిపాక వెంకటయ్య–వెంకటమ్మకు జూలై 17న ఇందిరమ్మ ఇల్లు మంజూరైనట్లు స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి మంజూరు పత్రం అందజేశారని తెలిపారు. ప్రభుత్వం రూ.5 లక్షలు అందిస్తుందన్న హామీతో కొత్త ఇల్లు నిర్మించుకోవాలనే ఉద్దేశంతో దంపతులు తమ పాత ఇంటిని కూల్చివేశారని చెప్పారు.

అయితే ఇల్లు కూల్చిన అనంతరం అధికారులు మాట మార్చి తమకు ఇల్లు మంజూరు కాదని చెప్పడంతో వృద్ధ దంపతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని చిలుక ప్రవీణ్ పేర్కొన్నారు. దీంతో గత మూడు నెలలుగా రేకుల షెడ్డులో, రోడ్డున దిక్కులేని స్థితిలో జీవనం సాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో పేదలకు ఇచ్చిన హామీల అమలులో ఇలాంటి పరిస్థితులు ఏర్పడటం బాధాకరమని చిలుక ప్రవీణ్ విమర్శించారు. వెంటనే అధికారులు స్పందించి బాధిత వృద్ధ దంపతుల పరిస్థితిని పరిశీలించి, వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.కార్యక్రమంలో చిలుక ప్రశాంత్, బొడ్డు వినోద్, మాదారపు రాజు, కావేరి వినయ్, తూడి ప్రశాంత్, చిలుక కిషోర్, మరుపట్ల నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మతిస్థిమితం లేని బాలుడిని  అన్నం సేవా ఫౌండేషన్‌ అప్పగించిన ఎస్ ఐ. మతిస్థిమితం లేని బాలుడిని  అన్నం సేవా ఫౌండేషన్‌ అప్పగించిన ఎస్ ఐ.
ఖమ్మం బ్యూరో, సెప్టెంబర్ 28(తెలంగాణ ముచ్చట్లు ) నాగులవంచ గ్రామంలో కొన్ని రోజులుగా రోడ్డు పై మతిస్థిమితం లేని బాలుడు తిరుగుతున్న విషయాన్ని స్థానికులు ద్వారా తెలుసుకున్న...
టిఫిన్ కోసం వెళ్లిన తండ్రి.. కారులో చిన్నారి లాక్.
కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ శ్రేణుల నిరసన.
నిరుపేదల ఇళ్ల సమస్య పరిష్కరించాలి.
మత్తుల వాగుపై వంతెన నిర్మించాలి.
గొర్రెలు, మేకల పెంపకందారుల సమస్యలు పరిష్కరించాలి.
చాగల్లు నుంచి కొండగట్టుకు హనుమాన్ మాల స్వాములు.