కాంగ్రెస్ నాయకులవి అసత్యపు ప్రకటనలు.

బీజేపీ మండల అధ్యక్షుడు గంటె ఉపేందర్ యాదవ్.

కాంగ్రెస్ నాయకులవి అసత్యపు ప్రకటనలు.

చిల్పూర్, సెప్టెంబర్ 27 (తెలంగాణ ముచ్చట్లు): 

స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఏ పార్టీలో ఉన్నారో నియోజకవర్గ ప్రజలకు స్పష్టం చేయాలని బీజేపీ చిల్పూర్ మండల అధ్యక్షుడు గంటె ఉపేందర్ యాదవ్ డిమాండ్ చేశారు.చిల్పూర్ మండలంలోని రాజవరంలో ఆదివారం నిర్వహించిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా, నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. బీజేపీ నాయకులు కాంగ్రెస్‌లో చేరినట్లు రాజకీయ పతనం భయంతో కాంగ్రెస్ నాయకులు అసత్య ప్రచారాలు, ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు.

టీడీపీ–బీజేపీ పొత్తులోనే కడియం శ్రీహరికి రాజకీయ అవకాశం లభించిందన్న విషయాన్ని మరిచిపోయారని అన్నారు. బీజేపీని లక్ష్యంగా చేసుకున్న కొద్దీ పార్టీ మరింత బలోపేతమవుతుందని పేర్కొన్నారు.కడియం శ్రీహరిపై దాఖలైన అనర్హత పిటిషన్లను తెలంగాణ శాసనసభ స్పీకర్ 2026 మార్చి 11న కొట్టివేసిన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో కడియం శ్రీహరిపై అనర్హత వేటు పడుతుందంటూ ఉపేందర్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు ఆయన రాజకీయ అభిప్రాయంగా పేర్కొనాలి.కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శులు వెలిశాల శ్రీనివాస్, ముక్కెర శ్రావణ్ యాదవ్, శక్తి కేంద్రం ఇన్‌చార్జ్ కన్నబోయిన అశోక్ యాదవ్, నాయకులు కట్ల అనిల్, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఉద్యమకారుల త్యాగాలకు రాజకీయ గుర్తింపు ఇవ్వాలి. ఉద్యమకారుల త్యాగాలకు రాజకీయ గుర్తింపు ఇవ్వాలి.
జమ్మికుంట, సెప్టెంబర్‌ 27 (తెలంగాణ ముచ్చట్లు): తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మలిదశ ఉద్యమంలో జీవితాలను పణంగా పెట్టి పోరాడిన ఉద్యమకారులకు రాజకీయంగా సముచిత ప్రాతినిధ్యం కల్పించాలని...
రైతు-కూలీ సంక్షేమమే సమాజ ప్రగతి .
వచ్చే మార్చి కల్లా నిర్మాణాలు పూర్తిచేసి, అందుబాటులోకి తేవాలి… 
పర్యాటక వసతుల అభివృద్ధితో గ్రామీణ ప్రాంతాలకు కొత్త శోభ... 
‎ప్రజలతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆప్యాయ పలకరింపులు.
అట్టహాసంగా అంతర్జాతీయ పర్యాటక దినోత్సవ వేడుకలు.
స్టేషన్ ఘనపూర్‌లో మొబైల్ షాపులో చోరీ.