విద్యా రంగానికి తాళ్ల మల్లేశం సేవలు చిరస్మరణీయం.
తాళ్ల మల్లేశం కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి.
Views: 0
On
వరంగల్, సెప్టెంబర్ 24 (తెలంగాణ ముచ్చట్లు):
ప్రముఖ విద్యావేత్త, తాళ్ల పద్మావతి విద్యాసంస్థల వ్యవస్థాపక చైర్మన్ తాళ్ల మల్లేశం మృతి పట్ల జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు.
గురువారం వరంగల్‌లోని తాళ్ల మల్లేశం నివాసానికి వెళ్లిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి మనోధైర్యం కల్పించారు.ఈ సందర్భంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ విద్యా రంగంలో తాళ్ల మల్లేశం అందించిన సేవలను స్మరించుకున్నారు. విద్యాభివృద్ధికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు. తాళ్ల మల్లేశం మృతి విద్యా రంగానికి తీరని లోటని పేర్కొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
24 Sep 2026 22:14:18
చిల్పూర్,సెప్టెంబర్24(తెలంగాణ ముచ్చట్లు):
చిల్పూర్ బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్వహణ తీరుపై గ్రామస్తుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఆలయం తమ గ్రామానికి చెందిన ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్నప్పటికీ, దేవాదాయ...


Comments