నాడు ఎస్సైగా.. నేడు సీఐగా..

ధర్మసాగర్ ఎస్‌హెచ్‌ఓగా శ్రీనివాస్.

నాడు ఎస్సైగా.. నేడు సీఐగా..

ధర్మసాగర్, సెప్టెంబర్ 1 (తెలంగాణ ముచ్చట్లు):

ధర్మసాగర్ పోలీస్‌స్టేషన్‌కు నూతన సీఐగా శ్రీనివాస్ బదిలీపై వచ్చారు. గతంలో ఇదే పోలీస్‌స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహించిన ఆయన, తాజాగా సీఐ హోదాలో ధర్మసాగర్ ఎస్‌హెచ్‌ఓగా బాధ్యతలు చేపట్టడం స్థానికంగా ఆసక్తికరంగా మారింది.
ఎస్సైగా పనిచేసిన సమయంలో శ్రీనివాస్ ఒక స్ట్రిక్ట్ పోలీస్ అధికారిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో రాజీ లేకుండా వ్యవహరిస్తూ, చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠినంగా చర్యలు తీసుకునేవారని స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు. చిన్నా, పెద్దా, పేదా, ధనికా అనే తారతమ్యం లేకుండా అందరినీ సమానంగా చూడటం ఆయన ప్రత్యేకతగా పేరొందింది.

ఆయన ఎస్సైగా విధులు నిర్వహించిన సమయంలో రాత్రి వేళల్లో పోలీసుల తనిఖీలు, పెట్రోలింగ్‌ను కట్టుదిట్టం చేయడంతో ధర్మసాగర్‌లో లా అండ్ ఆర్డర్ పటిష్టంగా ఉండేదని స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా రాత్రివేళల్లో అనవసరంగా బయట తిరిగే వారిలో సైతం పోలీసులంటే భయం ఉండేలా క్రమశిక్షణతో విధులు నిర్వహించారని గుర్తుచేసుకుంటున్నారు.
తన కఠినమైన పోలీసింగ్‌తో పాటు ప్రజల పట్ల సమాన వైఖరి, విధి నిర్వహణలో నిబద్ధతతో శ్రీనివాస్ అప్పట్లో స్థానికుల అభిమానాన్ని సైతం చూరగొన్నారు. ఆయనను అభిమానించే కొందరు ప్రేమగా “శివమణి” అని పిలుచుకునేవారని స్థానికులు చెబుతున్నారు.
నాడు ఎస్సైగా ధర్మసాగర్‌లో తనదైన ముద్ర వేసిన శ్రీనివాస్.. నేడు అదే ప్రాంతానికి సీఐగా రావడంతో శాంతిభద్రతల విషయంలో మళ్లీ తనదైన శైలిలో పనిచేస్తారనే ఆశాభావం స్థానికుల్లో వ్యక్తమవుతోంది.

Tags:

Post Your Comments

Comments

Latest News

నాడు ఎస్సైగా.. నేడు సీఐగా.. నాడు ఎస్సైగా.. నేడు సీఐగా..
ధర్మసాగర్, సెప్టెంబర్ 1 (తెలంగాణ ముచ్చట్లు): ధర్మసాగర్ పోలీస్‌స్టేషన్‌కు నూతన సీఐగా శ్రీనివాస్ బదిలీపై వచ్చారు. గతంలో ఇదే పోలీస్‌స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహించిన ఆయన, తాజాగా...
గోపాల్‌పూర్‌లో ఎమ్మార్పీఎస్‌, ఎంఎస్‌పీ గ్రామ కమిటీలు.
వెలుగొండకు నికర జలాలు తరలిస్తే సహించం.
సీఎం సహాయ నిధి పేదలకు పెన్నిధి.
కాంగ్రెస్ పాలనా వైఫల్యాలపై బీఆర్ఎస్ పోరుబాట.
వెల్టూర్ శివాలయానికి  హెచ్‌పీ మోటార్‌ విరాళం.
రాజేంద్రప్రసాద్ యాదవ్‌ను సన్మానించిన చిన్నారెడ్డి.