సాయిస్ఫూర్తి ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా ఓరియంటేషన్ ప్రోగ్రాం.

సాయిస్ఫూర్తి ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా ఓరియంటేషన్ ప్రోగ్రాం.

- నూతన విద్యార్థులకు ఘన స్వాగతం.
- విజయ శిఖరాలు అధిరోహించాలని అతిథుల ఆకాంక్ష.

సత్తుపల్లి, ఆగస్టు 29(తెలంగాణ ముచ్చట్లు): 

మండల పరిధిలోని బి గంగారం గ్రామం సాయిస్ఫూర్తి అటానమస్ ఇంజనీరింగ్ కళాశాలలో ఎంసెట్-2026 కౌన్సెలింగ్, మేనేజ్‌మెంట్ కోటా ద్వారా ఇంజనీరింగ్, ఎంబీఏలో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు శనివారం మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కళాశాల ఆడిటోరియంలో ఓరియంటేషన్ ప్రోగ్రాంను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విపాసన ఎడ్యుకేషనల్ ట్రస్టీ బండి అన్విద, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి, డాక్టర్ మట్టా దయానంద్, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, గంగారం సర్పంచ్ కాకర్ల రేవతి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి అన్విద మాట్లాడుతూ నూతనంగా కళాశాలలో అడుగుపెట్టిన విద్యార్థులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. “జ్ఞానంతో మిమ్మల్ని మీరు ఆయుధంగా చేసుకోండి. అదే భవిష్యత్తులో మీకు గొప్ప బలంగా మారుతుంది” అని అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అత్యుత్తమ మౌలిక సదుపాయాలు, విద్యా వనరులు అందించేందుకు యాజమాన్యం కృషి చేస్తుందని తెలిపారు. సైద్ధాంతిక, ఆచరణాత్మక అంశాలపై సమర్థవంతమైన బోధన అందిస్తూ విద్యార్థులను విజయవంతమైన భవిష్యత్తుకు సిద్ధం చేస్తామని చెప్పారు. కళాశాల చైర్మన్, ప్రముఖ పారిశ్రామికవేత్త, హెటెరో ఫార్మాస్యూటికల్స్ అధినేత, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ బండి పార్థసారథిరెడ్డి పంపిన సందేశాన్ని వర్చువల్‌గా వినిపించారు. సాయిస్ఫూర్తిలో చదివిన అనేక మంది విద్యార్థులు దేశ, విదేశాల్లోని ప్రముఖ సంస్థల్లో ఉన్నత స్థానాల్లో కొనసాగుతున్నారని ఆయన తెలిపారు. ప్రస్తుత విద్యార్థులు కూడా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. సాయిస్ఫూర్తి క్యాంపస్ ప్రతి విద్యార్థికి అపరిమిత అవకాశాలను కల్పిస్తుందని అన్నారు. హెటెరో స్పాన్సర్‌షిప్ పథకం ద్వారా అర్హత పొందిన విద్యార్థులకు ఫీజు మినహాయింపు కల్పిస్తున్నట్లు తెలిపారు. సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి మాట్లాడుతూ విద్య అంటే కేవలం మంచి మార్కులు సాధించడం, డిగ్రీ పొందడం మాత్రమే కాదని, జ్ఞానం, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, విలువలు, సవాళ్లను ఎదుర్కొనే ధైర్యాన్ని పెంపొందించుకోవడమని అన్నారు. విద్యార్థులు తమ ప్రతిభను వెలికితీసుకోవడంతో పాటు అనుభవాల నుంచి నేర్చుకుని భవిష్యత్తుకు సిద్ధం కావాలని సూచించారు. అలాగే అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మాట్లాడుతూ విద్యార్థులు పెద్ద కలలు కనాలని, వాటిని సాకారం చేసుకునేందుకు కష్టపడి పనిచేయాలని సూచించారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులను గౌరవించాలని, వైఫల్యాలకు భయపడకుండా ముందుకు సాగాలని అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, సానుకూల అభ్యాస వాతావరణం కల్పిస్తున్న కళాశాల యాజమాన్యం, అధ్యాపక బృందాన్ని అభినందించారు. కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ దాసరి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసే నాటికి తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకునే స్థాయిలో తీర్చిదిద్దుతామని తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వూటుకూరి శేషారత్నకుమారి మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో ఇంజనీరింగ్ సీట్ల భర్తీలో తమ కళాశాల 90 శాతం సీట్ల భర్తీతో రెండో స్థానంలో నిలిచిందని తెలిపారు. నాణ్యమైన విద్యపై నమ్మకంతో కళాశాలలో ప్రవేశాలు పొందిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు. కళాశాల సైన్స్ అండ్ హ్యుమానిటీస్ విభాగాధిపతి డాక్టర్ ఎస్.కె. మీరాసాహెబ్ మాట్లాడుతూ ‘విద్యార్థి’ అంటే అభ్యాసకుడని, కళాశాల అందిస్తున్న విద్యా వసతులు, వనరులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ షేక్ యాకూబ్, హెటెరో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ ప్రిన్సిపాల్ కొండా రవికుమార్, డీఏవీ స్కూల్ ప్రిన్సిపాల్ టి. శేషా సాయి శ్రీ, కళాశాల కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ పాముల శేఖర్ బాబు తదితరులు యూనివర్సిటీ టైమ్‌టేబుల్, సిలబస్, అకడమిక్ విధానం తదితర అంశాలను విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో అన్ని ఇంజనీరింగ్ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు, పాటలు, చిన్న స్కిట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నూతన విద్యార్థులకు అతిథులు, కళాశాల యాజమాన్యం అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.IMG-20260829-WA0768

Tags:

Post Your Comments

Comments

Latest News

టీసీల కోసం విద్యార్థుల ధర్నా. టీసీల కోసం విద్యార్థుల ధర్నా.
జమ్మికుంట టౌన్ ఆగస్టు 29 (తెలంగాణ ముచ్చట్లు): పట్టణంలోని విస్డం కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు టీసీలు (ట్రాన్స్‌ఫర్‌ సర్టిఫికెట్లు) ఇవ్వకుండా కళాశాల యాజమాన్యం తిప్పించుకుంటోందని...
పెద్దమందడి జిపిఓ కాశన్న అకాల మృతి.
గ్రామాల బాట పట్టిన మంత్రి పొన్నం ప్రభాకర్.
టీసీల కోసం విద్యార్థుల ధర్నా.
స్నేహితుడి కుటుంబానికి అండగా నిలిచిన మిత్రబృందం.
సాయిస్ఫూర్తి ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా ఓరియంటేషన్ ప్రోగ్రాం.
డ్రైనేజీలోకి దూసుకెళ్లిన బైక్.. వ్యక్తికి తీవ్ర గాయాలు.