గుర్తుతెలియని వ్యక్తి మృతి.. ఆచూకీ కోసం పోలీసుల ప్రయత్నం.

గుర్తుతెలియని వ్యక్తి మృతి.. ఆచూకీ కోసం పోలీసుల ప్రయత్నం.

జమ్మికుంట టౌన్ ఆగస్టు 24 (తెలంగాణ ముచ్చట్లు):

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందిన ఘటన వెలుగుచూసింది. సుమారు 40 నుంచి 45 సంవత్సరాల వయస్సు కలిగిన వ్యక్తి గత వారం రోజులుగా గ్రామంలో తిరుగుతూ ప్లాస్టిక్‌ సామగ్రిని సేకరిస్తూ, దొరికిన ఆహారం తింటూ జీవిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. గ్రామపంచాయతీ కార్యాలయం ఎదురుగా ఉన్న పాడుబడిన హోటల్‌లో రాత్రివేళ నిద్రించేవాడని చెప్పారు.
ఆ వ్యక్తి ఆదివారం (ఆగస్టు 23) పాడుబడిన హోటల్‌లో మృతిచెందినట్లు గుర్తించారు. మృతుడి ఎడమ చేతిపై ‘ఏయూ’ అక్షరాలతో టాటూ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడి వివరాలు తెలిసిన వారు లేదా అతడిని గుర్తుపట్టిన వారు సమీప పోలీస్‌స్టేషన్‌ను సంప్రదించాలని కోరారు.
మృతుడి వివరాలు గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ సమాచారాన్ని ప్రజలకు చేరేలా ప్రచురించాలని పోలీసు అధికారులు పాత్రికేయ మిత్రులను కోరారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

శరణుఘోషలతో మారుమోగిన అయ్యప్ప ఆలయం. శరణుఘోషలతో మారుమోగిన అయ్యప్ప ఆలయం.
జమ్మికుంట టౌన్ ఆగస్టు 24 (తెలంగాణ ముచ్చట్లు): జమ్మికుంట పట్టణంలోని శ్రీ అయ్యప్పస్వామి దేవాలయంలో సోమవారం ఆధ్యాత్మిక ఉత్సాహం వెల్లివిరిసింది. పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అయిత...
మహిళా పారిశుద్ధ్య కార్మికులకు చీరల పంపిణీ.
విద్యాభివృద్ధికి చేయూత.. అంగన్‌వాడి చిన్నారులకు కానుకలు.
గుర్తుతెలియని వ్యక్తి మృతి.. ఆచూకీ కోసం పోలీసుల ప్రయత్నం.
రిజర్వేషన్లను ప్రశ్నించే ముందు అసమానతలను ప్రశ్నించాలి.
భూ వివాదం కేసులో ఐదుగురికి ఐదేళ్ల జైలు.
జర్నలిస్టులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం.