ఫీజు బకాయిలపై కరీంనగర్‌లో బీజేపీ పోరుబాట.

రూ.15 వేల కోట్ల రీయింబర్స్‌మెంట్‌ వెంటనే విడుదల చేయాలని డిమాండ్.

ఫీజు బకాయిలపై కరీంనగర్‌లో బీజేపీ పోరుబాట.

కరీంనగర్‌,ఆగష్టు 24(తెలంగాణ ముచ్చట్లు ):

రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రూ.15 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో కరీంనగర్‌ బస్టాండ్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేశారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల కాకపోవడంతో విద్యార్థులు, కళాశాలల యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని నాయకులు పేర్కొన్నారు. ప్రభుత్వం బకాయిల చెల్లింపుపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఫీజులు చెల్లించలేక పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తక్షణమే స్పందించి పెండింగ్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడటం తగదని, ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు.
విద్యార్థుల హక్కుల కోసం దీక్షవిద్యార్థుల హక్కుల సాధన కోసం హైదరాబాద్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు దీక్ష చేపట్టారని నాయకులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల సమస్యలపై బీజేపీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఫీజు బకాయిలను విడుదల చేయాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

శరణుఘోషలతో మారుమోగిన అయ్యప్ప ఆలయం. శరణుఘోషలతో మారుమోగిన అయ్యప్ప ఆలయం.
జమ్మికుంట టౌన్ ఆగస్టు 24 (తెలంగాణ ముచ్చట్లు): జమ్మికుంట పట్టణంలోని శ్రీ అయ్యప్పస్వామి దేవాలయంలో సోమవారం ఆధ్యాత్మిక ఉత్సాహం వెల్లివిరిసింది. పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అయిత...
మహిళా పారిశుద్ధ్య కార్మికులకు చీరల పంపిణీ.
విద్యాభివృద్ధికి చేయూత.. అంగన్‌వాడి చిన్నారులకు కానుకలు.
గుర్తుతెలియని వ్యక్తి మృతి.. ఆచూకీ కోసం పోలీసుల ప్రయత్నం.
రిజర్వేషన్లను ప్రశ్నించే ముందు అసమానతలను ప్రశ్నించాలి.
భూ వివాదం కేసులో ఐదుగురికి ఐదేళ్ల జైలు.
జర్నలిస్టులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం.