వైయస్సార్ నగర్ లోని నిరుపేదలకు అండగా ఉంటాం .
మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ .
కాజీపేట్ ఆగస్టు 24 ( తెలంగాణ ముచ్చట్లు)
కాజీపేట్ నగరంలోని వైయస్సార్ నగర్ గుడిసెలలో నివసిస్తున్న నిరుపేద ప్రజలకు బిఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ అండగా ఉంటుందని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు . కాజీపేట్ లోనీ వైయస్సార్ నగర్ ను సోమవారం వినయ్ భాస్కర్ సందర్శించారు. ఈ సందర్భంగా వినయ్ భాస్కర్ మాట్లాడుతూ కోట్ల విలువైన వైయస్సార్ నగర్ భూమి పై కొందరు కన్నేసి కబ్జా చేయాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. వైయస్సార్ నగర్ కాలనీలో గత 20 సంవత్సరాలుగా పేదలు గుడిసెలు వేసుకొని నివసిస్తున్నారని వారిని కొందరు బలవంతంగా ఖాళీ చేయించే ప్రయత్నం కొనసాగిస్తున్నారని వారిని అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. అక్కడి నిరుపేదలకు తమ పార్టీ ఎప్పటికీ అండగా నిలుస్తుంది అని భరోసా ఇచ్చారు. షాపూర్ ఇరానీ కుటుంబ సభ్యుల మంటూ కొందరు వచ్చి ఈ భూమిని కబ్జా చేయాలని చూస్తున్నారని ఆ భూమిపై కన్నేసిన కాంగ్రెస్ నాయకులు, వారి అనుచరులు పేద ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ఆయన ఆరోపించారు. నిరుపేదలు ఇక్కడ 2005 నుంచి గుడిసెలు వేసుకొని జీవనం కొన్ని సాగిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఎస్ ఎస్ ఎస్ కాంప్లెక్స్ భూమిపై కోర్టులో కేసులో ఉన్న దనీ
తెలిసిన కాంప్లెక్స్ కు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ఓసి నీ ఇచ్చిందన్నారు. కొంతమంది భూమిని దొంగ పేపర్లు పుట్టించి తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇటీవల వచ్చిన కోర్టు తీర్పుల్లో ఆ భూమి ముమ్మాటికి ప్రభుత్వ స్థలంగా భావించవచ్చు అని ఆయన తెలిపారు. ఈ కాలనీలో నివాసం ఉంటున్న వారికి ఇంటి నెంబర్లు, ఆధార్ కార్డు, ఓటర్ కార్డ్ లు వచ్చాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులు డబుల్ బెడ్ రూమ్ ఇప్పిస్తామని చెప్పి ఇల్లు ఖాళీ చేయాలని ప్రయత్నం చేసేక్రమంలో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ విషయమై పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ చేసిన ఎవరు పట్టించుకోవడం లేదని కంప్లైంట్ ఇచ్చిన వారిపైనే స్థానిక పోలీసులు కేసు నమోదు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. బిఆర్ఎస్ పార్టీ పేదల పక్షాన ఉండి పోరాటం చేస్తుందన్నారు పేద ప్రజల కోసం అవసరమైతే సుప్రీంకోర్టు వరకు ఈ విషయాన్ని తీసుకెళ్తామన్నారు. ఇప్పటికే ఈ భూమి కోసం దాదాపు 30 కోట్ల రూపాయలు చేతులు మారాయి అని ఆయన ఆరోపించారు. గతంలో ఎన్నికల సమయంలో రైల్వే రిటైర్ ఉద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు ఈ ప్రభుత్వ భూమిని కేటాయిస్తే మా పైన కేసులు నమోదయ్యాయని ఆ కేసులను కోర్టు కొట్టి వేసిందని ఆయన వివరించారు. ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు అక్కడే ఇల్లు కట్టించి ఇచ్చి మిగిలిన భూమిలో ప్రభుత్వ కార్యాలయం ఏర్పాటు చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు ,మాజీ కార్పొరేటర్లు, రిటైర్డ్ రైల్వే పెన్షనర్స్, కాలనీవాసులు పాల్గొన్నారు.


Comments