52 ఏళ్ల మహిళ అదృశ్యం.. ఆచూకీ కోసం పోలీసుల గాలింపు.
మేడ్చల్, ఆగస్టు 24, తెలంగాణ ముచ్చట్లు:
మేడ్చల్ పరిధిలో 52 ఏళ్ల మహిళ అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. మాచబొల్లారంలోని అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న వైట్ల ఈశ్వరి అనే 52 ఏళ్ల మహిళ ఆగస్టు 24వ తేదీ తెల్లవారుజామున సుమారు 3 గంటల 41 నిమిషాల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజీలో నమోదైంది.
ఈ విషయాన్ని ఆమె కుమార్తె వైట్ల సత్య వీణీల పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంటి నుంచి వెళ్లే సమయంలో ఈశ్వరి ఎలాంటి మొబైల్ ఫోన్ వెంట తీసుకెళ్లలేదని తెలిపింది. అప్పటికి నైటీతో పాటు తెల్లటి స్కార్ఫ్ ధరించి ఉన్నట్లు పేర్కొంది. అయితే ఆ తర్వాత దుస్తులు మార్చుకుని పింక్ రంగు చీర ధరించి ఉండే అవకాశం ఉందని ఫిర్యాదులో తెలిపింది.
అదృశ్యమైన మహిళ ఎత్తు సుమారు 5.2 నుంచి 5.4 అడుగులు ఉండగా, మధ్యస్థ తెల్లటి ఛాయ, నలుపు-తెలుపు జుట్టు కలిగి ఉంటుందని కుటుంబ సభ్యులు తెలిపారు.
కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాల్లో గాలించినప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. మహిళను గుర్తించి ఆచూకీ తెలియజేయాలని, ఆమెను సురక్షితంగా కుటుంబ సభ్యుల వద్దకు చేర్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.


Comments