ఓటర్ల సవరణలపై బీఎల్‌ఓలకు అవగాహన.

మండలంలో 9,967 సవరణలు.. 1,381 అన్‌మ్యాపింగ్ నోటీసులు.

ఓటర్ల సవరణలపై బీఎల్‌ఓలకు అవగాహన.

పెద్దమందడి,ఆగస్టు24(తెలంగాణ ముచ్చట్లు):

ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా వనపర్తి జిల్లా  పెద్దమందడి తహసిల్దార్ కార్యాలయంలో బూత్ స్థాయి అధికారులకు (బీఎల్‌ఓలకు) అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తహసిల్దార్ మల్లికార్జున్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఓటర్ల జాబితాలో గుర్తించిన సవరణలు  అన్‌మ్యాపింగ్ నోటీసులపై బీఎల్‌ఓలకు అవగాహన కల్పించారు.మండల పరిధిలో మొత్తం 9,967 సవరణలు గుర్తించినట్లు తహసిల్దార్ మల్లికార్జున్ తెలిపారు. ఓటర్ల పేరు, తండ్రి/భర్త/తల్లి పేరు, వయస్సు తదితర వివరాల్లో ఉన్న వ్యత్యాసాలను బీఎల్‌ఓలు క్షేత్రస్థాయిలో పరిశీలించి ధ్రువీకరించాలని సూచించారు. 2002 ఎస్ ఐ ఆర్ ఓటరు జాబితా, ప్రస్తుత 2026 ఓటరు జాబితాలోని వివరాలను పరిశీలించి తేడాలు ఉన్న చోట నిబంధనల ప్రకారం సవరణలు చేపట్టాలన్నారు.స్పెల్లింగ్‌లో తేడాలు, ఇంటిపేరు మార్పులు లేదా లేకపోవడం, వయస్సులో వ్యత్యాసాలు తదితర అంశాలను పరిశీలించి, సంబంధిత ఓటరు నుంచి అవసరమైన వివరాలు, ఆధారాలను సేకరించి బీఎల్‌ఓ ధ్రువీకరణ పత్రం ద్వారా నిర్ధారించాలని సూచించారు. ధ్రువీకరణ పూర్తయిన అనంతరం వివరాలను ఆన్‌లైన్‌లో తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాలని తెలిపారు.అదేవిధంగా మండలం మొత్తం 1,381 అన్‌మ్యాపింగ్ నోటీసులు వచ్చినట్లు తహసిల్దార్ పేర్కొన్నారు. వీటిపై కూడా బీఎల్‌ఓలు ప్రత్యేక దృష్టి సారించి క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి, సంబంధిత ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. ఓటర్ల జాబితాలో ఎలాంటి తప్పులు లేకుండా, పారదర్శకంగా రూపొందించేందుకు బీఎల్‌ఓలు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని తహసిల్దార్ మల్లికార్జున్ సూచించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

శరణుఘోషలతో మారుమోగిన అయ్యప్ప ఆలయం. శరణుఘోషలతో మారుమోగిన అయ్యప్ప ఆలయం.
జమ్మికుంట టౌన్ ఆగస్టు 24 (తెలంగాణ ముచ్చట్లు): జమ్మికుంట పట్టణంలోని శ్రీ అయ్యప్పస్వామి దేవాలయంలో సోమవారం ఆధ్యాత్మిక ఉత్సాహం వెల్లివిరిసింది. పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అయిత...
మహిళా పారిశుద్ధ్య కార్మికులకు చీరల పంపిణీ.
విద్యాభివృద్ధికి చేయూత.. అంగన్‌వాడి చిన్నారులకు కానుకలు.
గుర్తుతెలియని వ్యక్తి మృతి.. ఆచూకీ కోసం పోలీసుల ప్రయత్నం.
రిజర్వేషన్లను ప్రశ్నించే ముందు అసమానతలను ప్రశ్నించాలి.
భూ వివాదం కేసులో ఐదుగురికి ఐదేళ్ల జైలు.
జర్నలిస్టులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం.