22ఏ భూములపై బీఆర్ఎస్ ధర్నా.

నిషేధిత జాబితా నుంచి భూములను తొలగించాలి: బీఆర్ఎస్.

22ఏ భూములపై బీఆర్ఎస్ ధర్నా.

రేకుర్తి, విద్యానగర్, కొత్తపల్లి ప్రాంతాల భూములను 22ఏ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్.

కరీంనగర్,ఆగష్టు 24(తెలంగాణ ముచ్చట్లు ):

రేకుర్తి, విద్యానగర్, కొత్తపల్లి ప్రాంతాల్లోని పలు సర్వే నంబర్ల భూములను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. నిషేధిత జాబితాలో చేర్చిన భూములను వెంటనే 22ఏ నుంచి తొలగించి బాధితులకు న్యాయం చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు.
ధర్నాలో మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పాల్గొని ఆందోళనకారులతో కలిసి కూర్చున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ 22ఏ జాబితాలో చేర్చిన భూముల సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
రేకుర్తి, విద్యానగర్, కొత్తపల్లి ప్రాంతాల్లో ఏళ్లుగా ప్రజల ఆధీనంలో ఉన్న భూములను నిషేధిత జాబితాలో చేర్చడంతో భూ యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. భూముల రిజిస్ట్రేషన్లు, క్రయవిక్రయాలు జరగకపోవడంతో బాధితులు ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి సంబంధిత రికార్డులను పరిశీలించి అర్హమైన భూములను 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించాలని కోరారు. బాధితులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని బీఆర్ఎస్ నాయకులు స్పష్టం చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

శరణుఘోషలతో మారుమోగిన అయ్యప్ప ఆలయం. శరణుఘోషలతో మారుమోగిన అయ్యప్ప ఆలయం.
జమ్మికుంట టౌన్ ఆగస్టు 24 (తెలంగాణ ముచ్చట్లు): జమ్మికుంట పట్టణంలోని శ్రీ అయ్యప్పస్వామి దేవాలయంలో సోమవారం ఆధ్యాత్మిక ఉత్సాహం వెల్లివిరిసింది. పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అయిత...
మహిళా పారిశుద్ధ్య కార్మికులకు చీరల పంపిణీ.
విద్యాభివృద్ధికి చేయూత.. అంగన్‌వాడి చిన్నారులకు కానుకలు.
గుర్తుతెలియని వ్యక్తి మృతి.. ఆచూకీ కోసం పోలీసుల ప్రయత్నం.
రిజర్వేషన్లను ప్రశ్నించే ముందు అసమానతలను ప్రశ్నించాలి.
భూ వివాదం కేసులో ఐదుగురికి ఐదేళ్ల జైలు.
జర్నలిస్టులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం.