డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పరిస్థితిపై మున్సిపల్ చైర్మన్ ఆరా.

పెండింగ్ పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని డిమాండ్.

డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పరిస్థితిపై మున్సిపల్ చైర్మన్ ఆరా.

జమ్మికుంట, ఆగస్టు 24 (తెలంగాణ ముచ్చట్లు):

జమ్మికుంట పట్టణ పరిధిలోని కేశవపురం కస్తూరిబా పాఠశాల సమీపంలో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ సోమవారం కౌన్సిలర్లతో కలిసి పరిశీలించారు. ఇళ్ల నిర్మాణ పరిస్థితి, పెండింగ్ పనులు, లబ్ధిదారులకు అందుబాటులో ఉన్న వసతులను పరిశీలించి సంబంధిత వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ జమ్మికుంట పట్టణానికి గత ప్రభుత్వం 500 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను మంజూరు చేసి నిర్మాణ పనులు చేపట్టిందన్నారు. ప్రభుత్వం మారిన తర్వాత కూడా ఇళ్ల పంపిణీపై లబ్ధిదారులు ఆశగా ఎదురుచూస్తున్నారని తెలిపారు. అయితే నిర్మాణం పూర్తికాని ఇళ్లను కూడా పూర్తయినట్లుగా చూపిస్తూ ప్రజలను అయోమయానికి గురిచేయడం సరికాదన్నారు.
కస్తూరిబా పాఠశాల సమీపంలో సుమారు 240 ఇళ్లు ఉన్నాయని అధికారులు చెబుతున్నప్పటికీ, ప్రస్తుతం కేవలం 24 ఇళ్లు మాత్రమే నివాసయోగ్యంగా ఉన్నాయని చైర్మన్ తెలిపారు. మిగిలిన ఇళ్లలో కొన్ని పునాది దశలో, మరికొన్ని పిల్లర్ల దశలో ఉండగా, కొన్ని ఇళ్లలో ఒక అంతస్తు నిర్మించి మరో అంతస్తు పనులు పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. నిర్మాణ ప్రాంతంలోని సామగ్రిని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేయడంతో కొన్ని ఇళ్లు శిథిలావస్థకు చేరుకున్నాయని తెలిపారు.
ప్రభుత్వం ఇప్పటికే లబ్ధిదారులను ఎంపిక చేసి మంజూరు పత్రాలు అందిస్తామని ప్రకటించిన నేపథ్యంలో, ముందుగా ఆయా ఇళ్ల నిర్మాణ పరిస్థితిని లబ్ధిదారులతోనే పరిశీలింపజేయాలని కోరారు. అవసరమైన నిధులు కేటాయించి పెండింగ్ నిర్మాణ పనులను పూర్తి చేసి ఇళ్లను నివాసయోగ్యంగా మార్చిన తర్వాతే పంపిణీ చేపట్టాలని సూచించారు.
రాజకీయ విమర్శలు తమకు అవసరం లేదని, ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చడమే ముఖ్యమని చైర్మన్ పేర్కొన్నారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల విషయంలో ప్రజలను పదేపదే ఆశలు పెట్టి నిరీక్షించేలా చేయకుండా స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, హౌసింగ్ శాఖ అధికారులను కోరారు. సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయి సమాచారం సేకరించి, పెండింగ్ పనులకు అవసరమైన నిధులు కేటాయించి ఇళ్లను పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు శీలం శ్రీనివాస్, కొలుగూరి సురేష్, ఫిరోజ్, మైస రవి, పరశురామ్, శంకర్, శివ తదితరులు పాల్గొన్నారు.IMG-20260824-WA0691

Tags:

Post Your Comments

Comments

Latest News

శరణుఘోషలతో మారుమోగిన అయ్యప్ప ఆలయం. శరణుఘోషలతో మారుమోగిన అయ్యప్ప ఆలయం.
జమ్మికుంట టౌన్ ఆగస్టు 24 (తెలంగాణ ముచ్చట్లు): జమ్మికుంట పట్టణంలోని శ్రీ అయ్యప్పస్వామి దేవాలయంలో సోమవారం ఆధ్యాత్మిక ఉత్సాహం వెల్లివిరిసింది. పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అయిత...
మహిళా పారిశుద్ధ్య కార్మికులకు చీరల పంపిణీ.
విద్యాభివృద్ధికి చేయూత.. అంగన్‌వాడి చిన్నారులకు కానుకలు.
గుర్తుతెలియని వ్యక్తి మృతి.. ఆచూకీ కోసం పోలీసుల ప్రయత్నం.
రిజర్వేషన్లను ప్రశ్నించే ముందు అసమానతలను ప్రశ్నించాలి.
భూ వివాదం కేసులో ఐదుగురికి ఐదేళ్ల జైలు.
జర్నలిస్టులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం.