బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, ఇన్సూరెన్స్‌ రంగాలపై విద్యార్థులకు అవగాహన.

వీఎస్‌ఆర్ డిగ్రీ కళాశాలలో సిపీబీఫ్ఐ కోర్సు పరిచయ కార్యక్రమం.

బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, ఇన్సూరెన్స్‌ రంగాలపై విద్యార్థులకు అవగాహన.

హుజురాబాద్,ఆగష్టు 24(తెలంగాణ ముచ్చట్లు ):

సింగాపూర్, హుజూరాబాద్‌: విద్యార్థుల కెరీర్‌ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని సింగాపూర్‌లోని వీఎస్‌ఆర్ డిగ్రీ కళాశాలలో సిపీబీఫ్ఐ (బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, ఇన్సూరెన్స్‌ సర్టిఫికెట్‌ ప్రోగ్రామ్‌) కోర్సుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రుబికాన్‌ ఫౌండేషన్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ సీనియర్‌ ట్రైనర్‌ అభిషా బ్లెస్సీ విద్యార్థులకు కోర్సు ప్రాముఖ్యత, శిక్షణ విధానం, బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, ఇన్సూరెన్స్‌ రంగాల్లో ఉన్న కెరీర్‌ అవకాశాలపై వివరించారు.
120 గంటల శిక్షణా కార్యక్రమంగా రూపొందించిన సిపీబీఫ్ఐ కోర్సును పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్‌ అందజేస్తారని తెలిపారు. ఈ కోర్సు ద్వారా విద్యార్థుల్లో ఆర్థిక సేవల రంగంపై అవగాహనతో పాటు ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు అవసరమైన నైపుణ్యాలు పెంపొందుతాయని వివరించారు.
విద్యార్థుల భవిష్యత్‌ కెరీర్‌కు ఉపయోగపడే ఇలాంటి కార్యక్రమాన్ని కళాశాల యాజమాన్యం ముందుచూపుతో చేపట్టడంపై అభినందనలు వ్యక్తమయ్యాయి. త్వరలోనే కళాశాలలో సిపీబీఫ్ఐ శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ అజయ్‌ కుమార్‌ పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు. విద్యార్థులు కూడా కార్యక్రమంపై ఆసక్తి కనబరుస్తూ చురుగ్గా పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

శరణుఘోషలతో మారుమోగిన అయ్యప్ప ఆలయం. శరణుఘోషలతో మారుమోగిన అయ్యప్ప ఆలయం.
జమ్మికుంట టౌన్ ఆగస్టు 24 (తెలంగాణ ముచ్చట్లు): జమ్మికుంట పట్టణంలోని శ్రీ అయ్యప్పస్వామి దేవాలయంలో సోమవారం ఆధ్యాత్మిక ఉత్సాహం వెల్లివిరిసింది. పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అయిత...
మహిళా పారిశుద్ధ్య కార్మికులకు చీరల పంపిణీ.
విద్యాభివృద్ధికి చేయూత.. అంగన్‌వాడి చిన్నారులకు కానుకలు.
గుర్తుతెలియని వ్యక్తి మృతి.. ఆచూకీ కోసం పోలీసుల ప్రయత్నం.
రిజర్వేషన్లను ప్రశ్నించే ముందు అసమానతలను ప్రశ్నించాలి.
భూ వివాదం కేసులో ఐదుగురికి ఐదేళ్ల జైలు.
జర్నలిస్టులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం.