సురవరం ప్రతాప్‌రెడ్డి పార్కులో ఇతర నిర్మాణాలు చేపట్టవద్దు.

ప్రజావాణిలో కలెక్టర్‌ కు కౌన్సిలర్ ఏర్వ అరుణ శ్రీనివాసులు వినతి .

సురవరం ప్రతాప్‌రెడ్డి పార్కులో ఇతర నిర్మాణాలు చేపట్టవద్దు.

వనపర్తి,ఆగస్టు24(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి పట్టణంలోని భగత్‌సింగ్‌నగర్‌లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సమీపంలో ఉన్న సురవరం ప్రతాప్‌రెడ్డి పార్కులో నిబంధనలకు విరుద్ధంగా ఇతర నిర్మాణాలు చేపట్టవద్దని కోరుతూ 22వ వార్డు కౌన్సిలర్ ఏర్వ అరుణ శ్రీనివాసులు సోమవారం జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభిని కలిసి వినతిపత్రం అందజేశారు.వనపర్తి తొలి ఎమ్మెల్యే సురవరం ప్రతాప్‌రెడ్డి జ్ఞాపకార్థం ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసిన స్థలంలో పార్కును ఏర్పాటు చేశారని కౌన్సిలర్ తెలిపారు. పార్కు ఏర్పాటుకు సంబంధించి 2020 సెప్టెంబర్ 30న అప్పటి మున్సిపల్ కౌన్సిల్ ఏకగ్రీవ తీర్మానం చేసిందని పేర్కొన్నారు. పార్కు ముందు భాగంలో బస్‌షెల్టర్ కూడా ఉండటంతో ప్రయాణికులు సేదతీరేందుకు, స్థానిక ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు ఈ పార్కు ఉపయోగకరంగా ఉందన్నారు.ప్రస్తుతం పార్కు స్థలంలో ఇతర నిర్మాణాలు చేపట్టేందుకు జరుగుతున్న ప్రయత్నాలను వార్డు ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని అరుణ శ్రీనివాసులు తెలిపారు. పార్కు ఉద్దేశాన్ని దెబ్బతీసే విధంగా ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. సురవరం ప్రతాప్‌రెడ్డి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన పార్కును యథావిధిగా కొనసాగిస్తూ, ఆయన గౌరవాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా మున్సిపల్ కౌన్సిల్ ఏకగ్రీవ తీర్మానం ప్రతిని కలెక్టర్‌కు అందజేశారు. పార్కు స్థలాన్ని ప్రజల వినియోగానికే కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

శరణుఘోషలతో మారుమోగిన అయ్యప్ప ఆలయం. శరణుఘోషలతో మారుమోగిన అయ్యప్ప ఆలయం.
జమ్మికుంట టౌన్ ఆగస్టు 24 (తెలంగాణ ముచ్చట్లు): జమ్మికుంట పట్టణంలోని శ్రీ అయ్యప్పస్వామి దేవాలయంలో సోమవారం ఆధ్యాత్మిక ఉత్సాహం వెల్లివిరిసింది. పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అయిత...
మహిళా పారిశుద్ధ్య కార్మికులకు చీరల పంపిణీ.
విద్యాభివృద్ధికి చేయూత.. అంగన్‌వాడి చిన్నారులకు కానుకలు.
గుర్తుతెలియని వ్యక్తి మృతి.. ఆచూకీ కోసం పోలీసుల ప్రయత్నం.
రిజర్వేషన్లను ప్రశ్నించే ముందు అసమానతలను ప్రశ్నించాలి.
భూ వివాదం కేసులో ఐదుగురికి ఐదేళ్ల జైలు.
జర్నలిస్టులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం.