సదరం సర్టిఫికెట్ కోసం ఏడాదిగా ఎదురుచూపులు.

నిమ్స్‌లో ధ్రువీకరణ.. కరీంనగర్‌లో సర్టిఫికెట్‌కు నిరాకరణ?

సదరం సర్టిఫికెట్ కోసం ఏడాదిగా ఎదురుచూపులు.

తిమ్మాపూర్, ఆగస్టు 24(తెలంగాణ ముచ్చట్లు ):

జన్యులోపంతో నడవలేని స్థితిలో ఉన్న తిమ్మాపూర్ మండలానికి చెందిన బాలుడు అడిచర్ల ప్రసాద్‌కు సదరం సర్టిఫికెట్ కోసం ఏడాది కాలంగా ఎదురుచూస్తున్నా ఇప్పటికీ సర్టిఫికెట్ జారీ కాలేదని అతని తండ్రి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం కరీంనగర్ కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి హాజరై అధికారులకు తన కుమారుడి సమస్యను వివరించారు.
తన కుమారుడు జన్యులోపంతో నడవలేని పరిస్థితిలో ఉన్నాడని, హైదరాబాద్‌లోని నిమ్స్ వైద్యులు ఇప్పటికే వైద్యపరంగా ధ్రువీకరించారని శ్రీనివాస్ తెలిపారు. నిమ్స్ వైద్యుల ధ్రువీకరణ ఉన్నప్పటికీ కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రం సదరం సర్టిఫికెట్ జారీ చేయడం లేదని ఆయన వాపోయారు.
సదరం సర్టిఫికెట్ కోసం గత ఏడాది కాలంగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా సమస్య పరిష్కారం కావడం లేదని, ప్రతిసారి ఆసుపత్రికి వెళ్లినా ఇబ్బందులు ఎదురవుతున్నాయని శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. సర్టిఫికెట్ లేకపోవడంతో తన కుమారుడికి అందాల్సిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు, దివ్యాంగుల కోసం అమలు చేస్తున్న పలు ప్రయోజనాలు పొందలేకపోతున్నామని తెలిపారు.
తన కుమారుడి పరిస్థితిని అధికారులు మానవతా దృక్పథంతో పరిశీలించి, నిమ్స్ వైద్యుల ధ్రువీకరణను పరిగణనలోకి తీసుకుని సదరం సర్టిఫికెట్ మంజూరు చేయాలని శ్రీనివాస్ కోరారు. సమస్యను త్వరగా పరిష్కరించి తన కుమారుడికి ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రజావాణిలో అధికారులను విజ్ఞప్తి చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

శరణుఘోషలతో మారుమోగిన అయ్యప్ప ఆలయం. శరణుఘోషలతో మారుమోగిన అయ్యప్ప ఆలయం.
జమ్మికుంట టౌన్ ఆగస్టు 24 (తెలంగాణ ముచ్చట్లు): జమ్మికుంట పట్టణంలోని శ్రీ అయ్యప్పస్వామి దేవాలయంలో సోమవారం ఆధ్యాత్మిక ఉత్సాహం వెల్లివిరిసింది. పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అయిత...
మహిళా పారిశుద్ధ్య కార్మికులకు చీరల పంపిణీ.
విద్యాభివృద్ధికి చేయూత.. అంగన్‌వాడి చిన్నారులకు కానుకలు.
గుర్తుతెలియని వ్యక్తి మృతి.. ఆచూకీ కోసం పోలీసుల ప్రయత్నం.
రిజర్వేషన్లను ప్రశ్నించే ముందు అసమానతలను ప్రశ్నించాలి.
భూ వివాదం కేసులో ఐదుగురికి ఐదేళ్ల జైలు.
జర్నలిస్టులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం.