జర్నలిస్టులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం.

జర్నలిస్టులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం.

*అర్హులైన ప్రతి జర్నలిస్టును ఆదుకుంటాం*

*ఇళ్ల పట్టాల సమస్యకు పూర్తిస్థాయిలో సహకరిస్తాం: వొడితల ప్రణవ్*

హుజురాబాద్, ఆగస్టు 24 (తెలంగాణ ముచ్చట్లు): 

జర్నలిస్టులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని, ప్రజా ప్రభుత్వంలో జర్నలిస్టుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు. అర్హులైన ప్రతి జర్నలిస్టును ఆదుకుంటామని, వారి ఇళ్ల పట్టాలకు సంబంధించిన సమస్యలను న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా పరిష్కరించేందుకు పూర్తిస్థాయిలో సహకరిస్తామని హామీ ఇచ్చారు.
సోమవారం హుజురాబాద్ పట్టణంలోని అంబేద్కర్ కూడలిలో జర్నలిస్టులు చేపట్టిన రిలే నిరాహారదీక్ష శిబిరాన్ని వొడితల ప్రణవ్ సందర్శించారు. దీక్ష చేస్తున్న జర్నలిస్టులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలిపారు. అనంతరం జర్నలిస్టులకు నిమ్మరసం ఇచ్చి రిలే నిరాహారదీక్షలను విరమింపజేశారు.
ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా ఇచ్చిన జర్నలిస్టుల ఇళ్ల పట్టాల విషయంలో భవిష్యత్తులో ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో కీలకపాత్ర పోషిస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని పేర్కొన్నారు.
జర్నలిస్టుల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని ప్రణవ్ హామీ ఇచ్చారు. అర్హత ఉన్న ప్రతి జర్నలిస్టుకు న్యాయం జరిగేలా తన వంతు సహకారం అందిస్తానని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో హుజురాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ సుహాసిని, కౌన్సిలర్లు, పట్టణ, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, జర్నలిస్టులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

శరణుఘోషలతో మారుమోగిన అయ్యప్ప ఆలయం. శరణుఘోషలతో మారుమోగిన అయ్యప్ప ఆలయం.
జమ్మికుంట టౌన్ ఆగస్టు 24 (తెలంగాణ ముచ్చట్లు): జమ్మికుంట పట్టణంలోని శ్రీ అయ్యప్పస్వామి దేవాలయంలో సోమవారం ఆధ్యాత్మిక ఉత్సాహం వెల్లివిరిసింది. పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అయిత...
మహిళా పారిశుద్ధ్య కార్మికులకు చీరల పంపిణీ.
విద్యాభివృద్ధికి చేయూత.. అంగన్‌వాడి చిన్నారులకు కానుకలు.
గుర్తుతెలియని వ్యక్తి మృతి.. ఆచూకీ కోసం పోలీసుల ప్రయత్నం.
రిజర్వేషన్లను ప్రశ్నించే ముందు అసమానతలను ప్రశ్నించాలి.
భూ వివాదం కేసులో ఐదుగురికి ఐదేళ్ల జైలు.
జర్నలిస్టులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం.