మద్దిగట్లలో వైభవంగా పోచమ్మ బోనాల పండుగ.

మద్దిగట్లలో వైభవంగా పోచమ్మ బోనాల పండుగ.

పెద్దమందడి,ఆగస్టు25(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మద్దిగట్ల గ్రామంలో పోచమ్మ బోనాల పండుగను గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి నెత్తిన బోనాలతో ఊరేగింపుగా తరలివెళ్లి పోచమ్మ తల్లికి బోనాలను సమర్పించారు.డప్పు వాయిద్యాలు, మంగళ వాయిద్యాల నడుమ సాగిన బోనాల ఊరేగింపుతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని పోచమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని పోచమ్మ తల్లిని వేడుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. గ్రామ పెద్దలు, యువత, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పండుగను విజయవంతంగా నిర్వహించారు.IMG-20260825-WA0064

Tags:

Post Your Comments

Comments

Latest News

గట్లనర్సింగాపూర్‌లో నూతన బస్‌షెల్టర్ నిర్మాణానికి ఆర్టీసీ అధికారుల పరిశీలన. గట్లనర్సింగాపూర్‌లో నూతన బస్‌షెల్టర్ నిర్మాణానికి ఆర్టీసీ అధికారుల పరిశీలన.
భీమదేవరపల్లి, ఆగస్టు 25 (తెలంగాణ ముచ్చట్లు): గట్లనర్సింగాపూర్ గ్రామంలో నూతన బస్‌షెల్టర్ నిర్మాణానికి ఆర్టీసీ అధికారులు మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. రవాణా శాఖ మంత్రి పొన్నం...
మద్దిగట్లలో వైభవంగా పోచమ్మ బోనాల పండుగ.
శరణుఘోషలతో మారుమోగిన అయ్యప్ప ఆలయం.
మహిళా పారిశుద్ధ్య కార్మికులకు చీరల పంపిణీ.
విద్యాభివృద్ధికి చేయూత.. అంగన్‌వాడి చిన్నారులకు కానుకలు.
గుర్తుతెలియని వ్యక్తి మృతి.. ఆచూకీ కోసం పోలీసుల ప్రయత్నం.
రిజర్వేషన్లను ప్రశ్నించే ముందు అసమానతలను ప్రశ్నించాలి.