గట్లనర్సింగాపూర్‌లో నూతన బస్‌షెల్టర్ నిర్మాణానికి ఆర్టీసీ అధికారుల పరిశీలన.
భీమదేవరపల్లి, ఆగస్టు 25 (తెలంగాణ ముచ్చట్లు):
గట్లనర్సింగాపూర్ గ్రామంలో నూతన బస్‌షెల్టర్ నిర్మాణానికి ఆర్టీసీ అధికారులు మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు వరంగల్ ఆర్టీసీ రీజినల్ మేనేజర్ భానుప్రసాద్ బస్‌షెల్టర్ ప్రాంతాన్ని పరిశీలించి నిర్మాణానికి సంబంధించిన సాంకేతిక వివరాలను సేకరించారు.
గ్రామంలోని బస్‌షెల్టర్ శిథిలావస్థకు చేరుకోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గ్రామ సర్పంచ్ బొల్లంపల్లి అజయ్ కుమార్ మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన మంత్రి, ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండేలా ఆధునిక వసతులతో నూతన బస్‌షెల్టర్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు.హామీ అమలులో భాగంగా ఆర్టీసీ అధికారులు స్థలాన్ని పరిశీలించి నిర్మాణానికి అవసరమైన వివరాలను సేకరించారు. త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభించి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువస్తామని అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఈఈ శ్రీకాంత్, ఏఈ మల్లారెడ్డి, సర్పంచ్ బొల్లంపల్లి అజయ్ కుమార్, ఉపసర్పంచ్ బొడిగె శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి గుడికందుల మధు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పొన్నాల మురళి, వార్డు సభ్యులు బొల్లంపల్లి షెడ్రెక్, కాసనగొట్టు సాయిరాం, బొల్లంపల్లి సుశాంత్ తదితరులు పాల్గొన్నారు.


Comments