విశ్వకర్మ కార్పెంటర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌కు నూతన కార్యవర్గం.

విశ్వకర్మ కార్పెంటర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌కు నూతన కార్యవర్గం.

జమ్మికుంట టౌన్ ఆగస్టు 26 (తెలంగాణ ముచ్చట్లు):

విశ్వకర్మ కార్పెంటర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ నూతన కమిటీకి మున్సిపల్‌ చైర్మన్‌ మొలుగు ప్రశాంత్‌ కుమార్‌ దిలీప్‌ శుభాకాంక్షలు తెలిపారు. జమ్మికుంట పట్టణ పరిధిలో నిర్వహించిన అసోసియేషన్‌ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై నూతన కమిటీ సభ్యులను అభినందించారు.
ఈ సందర్భంగా మున్సిపల్‌ చైర్మన్‌ మాట్లాడుతూ.. జూపాక శ్రీనివాస చారి అధ్యక్షతన ఏర్పడిన నూతన కమిటీకి అభినందనలు తెలిపారు. విశ్వకర్మ కార్పెంటర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఎంతో పెద్దదని, ఇంతటి బలమైన సభ్యత్వంతో ఉన్న సంఘాలు అరుదుగా ఉంటాయని పేర్కొన్నారు. జమ్మికుంట పట్టణంలో నివసిస్తున్న ఒక పౌరుడిగా, అసోసియేషన్‌ సభ్యుల సంక్షేమానికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తానని హామీ ఇచ్చారు.
ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావడం, పెన్షన్లు, ఇళ్ల మంజూరు, రోడ్లు తదితర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా తన పరిధిలో పూర్తి సహకారం అందిస్తానని స్పష్టం చేశారు. అసోసియేషన్‌కు సంబంధించిన ప్రతి విషయంలోనూ తన శక్తిమేరకు అండగా ఉంటానని తెలిపారు.
కార్యక్రమానికి తనను ఆహ్వానించిన అసోసియేషన్‌ నాయకులు, సభ్యులకు పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
కార్యక్రమంలో నూతన అధ్యక్షుడు జూపాక శ్రీనివాస చారి, రాజు చారి, సంపత్‌ చారి, నూతన కమిటీ సభ్యులు, అసోసియేషన్‌ ప్రతినిధులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారుIMG-20260826-WA0020

Tags:

Post Your Comments

Comments

Latest News

మేఘారెడ్డిని విమర్శించే నైతిక హక్కు మీకుందా? మేఘారెడ్డిని విమర్శించే నైతిక హక్కు మీకుందా?
వనపర్తి,ఆగస్టు26(తెలంగాణ ముచ్చట్లు):  వనపర్ ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డిపై బీఆర్‌ఎస్‌ నాయకులు చేస్తున్న నిరాధార ఆరోపణలను కాంగ్రెస్‌ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యేను విమర్శించే ముందు కృష్ణానాయక్‌ తన...
విశ్వకర్మ కార్పెంటర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌కు నూతన కార్యవర్గం.
తిమ్మాపురం ఘటనకు న్యాయం చేయాలి.. లేదంటే ఉద్యమం.
గట్లనర్సింగాపూర్‌లో నూతన బస్‌షెల్టర్ నిర్మాణానికి ఆర్టీసీ అధికారుల పరిశీలన.
మద్దిగట్లలో వైభవంగా పోచమ్మ బోనాల పండుగ.
శరణుఘోషలతో మారుమోగిన అయ్యప్ప ఆలయం.
మహిళా పారిశుద్ధ్య కార్మికులకు చీరల పంపిణీ.