మేఘారెడ్డిని విమర్శించే నైతిక హక్కు మీకుందా?
కృష్ణానాయక్‌ను నిలదీసిన కాంగ్రెస్ నేతలు.
వనపర్తి,ఆగస్టు26(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్ ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డిపై బీఆర్‌ఎస్ నాయకులు చేస్తున్న నిరాధార ఆరోపణలను కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యేను విమర్శించే ముందు కృష్ణానాయక్ తన గత చరిత్రను ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. బుధవారం వనపర్తి డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు వాల్యా నాయక్, వనపర్తి మండల అధ్యక్షుడు రవి నాయక్, అంకాయపల్లి సర్పంచ్ ఆంజనేయులు నాయక్ మాట్లాడుతూ.. గిరిజనుల అభివృద్ధికి ఎమ్మెల్యే మేఘారెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు. ఆయనపై తప్పుడు ఆరోపణలు చేస్తే రాజకీయంగా దీటుగా ఎదుర్కొంటామని హెచ్చరించారు.కృష్ణానాయక్ గతంలో నిర్వహించిన ప్రజాప్రతినిధి బాధ్యతలు, అభివృద్ధి పనులపై ముందుగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. లిఫ్ట్ ఇరిగేషన్ పనుల్లో సర్పంచ్‌ల పేరుతో రూ.60 లక్షలు కాజేశారనే ఆరోపణలపై వివరణ ఇవ్వాలని కోరారు. గిరిజనుల కోసం కేటాయించిన ఎస్టీ నిధుల వినియోగంపై కూడా బీఆర్‌ఎస్ నాయకులు ప్రజలకు లెక్క చెప్పాలని సవాల్ విసిరారు.మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డికి ఎమ్మెల్యే మేఘారెడ్డిని రాజకీయంగా ఎదుర్కొనే సత్తా లేకనే ప్రజలు గత ఎన్నికల్లో తగిన తీర్పు ఇచ్చారని అన్నారు. ఇకపై ఎమ్మెల్యేపై నిరాధార ఆరోపణలు చేస్తే ప్రతి ఆరోపణకు దీటుగా సమాధానం ఇస్తామని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు.ఈ సమావేశంలో చిగురుచెట్టు తండా మాజీ సర్పంచ్ రాధాకృష్ణ నాయక్ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.


Comments