స్నేహితుడి కుటుంబానికి అండగా నిలిచిన మిత్రబృందం.
Views: 83
On
వేలేరు, ఆగస్టు 29 (తెలంగాణ ముచ్చట్లు):
వేలేరు మండలం పీచర గ్రామానికి చెందిన గజవెళ్లి నాగరాజు తండ్రి గజవెళ్లి కుమారస్వామి ఇటీవల మృతి చెందగా, ఆయన కుటుంబాన్ని తోటి స్నేహితులు పరామర్శించి తమ మానవత్వాన్ని చాటుకున్నారు.
కుటుంబానికి కొంతైనా అండగా నిలవాలనే ఉద్దేశంతో స్నేహితులు కలిసి 50 కిలోల బియ్యాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నాగరాజు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, కష్టకాలంలో తాము ఎల్లప్పుడూ తోడుగా ఉంటామని భరోసా ఇచ్చారు.
స్నేహం అనేది సంతోషాలను పంచుకోవడమే కాకుండా, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అండగా నిలవడంలోనే నిజమైన విలువ ఉందని వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మరిజె రామకృష్ణ, నక్క సంపత్, ఏలూరి కరుణాకర్, దామెర రాజేష్, లోనే శివాజీ, కొయ్యడ వంశీ తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
29 Aug 2026 21:30:52
జమ్మికుంట టౌన్ ఆగస్టు 29 (తెలంగాణ ముచ్చట్లు):
పట్టణంలోని విస్డం కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు టీసీలు (ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్లు) ఇవ్వకుండా కళాశాల యాజమాన్యం తిప్పించుకుంటోందని...


Comments